వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల్యంలో స్నేహితులు: ఆమె జడ్జి, అతడు దొంగ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలోని మియామి రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జడ్జి మెండి గ్లేసర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కేసును విచారిస్తున్నారు. ఓ దోపీడీ కేసు విషమయై నిందితుడుగా ఉన్న ఆథర్ బూత్ అనే వ్యక్తి కోర్టుకు వచ్చాడు.

ఇంతలో నిందితుడిని చూసిన ఆమె గుర్తుపట్టారు. 'చిన్నప్పుడు నువ్వు నార్టీనస్ మిడిల్ స్కూల్‌లో చదివావా?' అని ప్రశ్నించారు. 'అవును' అని నిందితుడు సమాధానం చెప్పడంతో, 'మీరు హార్డర్ బాల్డ్ కదా?' అని అడిగారు.

దీంతో జడ్జి స్ధానంలో ఉన్న ఆమె 'చిన్నప్పుడు స్కూల్‌లో అందరికీ ఆదర్శంగా, ఎంతో చురుకుగా, బాగా చదువుకున్న మీరు ఇలా ఎలా మారారు?' అంటూ ప్రశ్నించారు. తానెవరో అతనికి గుర్తు చేశారు. చిన్నప్పుడు స్కూల్లో తామిద్దరం పుట్ బాల్ ఎలా అడిందీ, స్కూల్‌లో ఏం చేసిందీ గుర్తు చేశారు.

Sentencing judge recognises defendant as school friend

అంతే అతడు ఆ మహిళా జడ్జిని గుర్తుపట్టి పశ్చాత్తాపంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలి స్థానాన్ని, తన ప్రస్తుత పరిస్థితిని తలచుకొని కుంగిపోయాడు.

ఆ జడ్జి మాత్రం మనం అప్పుడే వయసులో ఎంత పెద్ద వాళ్లమైపోయామో తలచుకుంటే బాధగా ఉంది అంటూ నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ అతను అదేమీ పట్టించుకోకుండా కన్నీటి పర్యంతమయ్యాడు.

డ్రగ్ సరఫరా కేసులో అతని నేరం రుజువవడంతో 44 వేల డాలర్లు చెల్లించాలని తీర్పు వెలువరించారు. రాబోయే రోజుల్లో తన స్నేహితుడు నీతివంతమైన జీవితాన్ని గడపాలని ఆ మహిళా జడ్జి ఆకాంక్షించారు.

English summary
A county judge in Miami-Dade had a childhood reminder when a man who appeared before her was a childhood friend. "we used to play football together...he was the nicest kid in middleschool," says judge, Mindy Glazer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X