ఏడుగురు చిన్నారులు సహా 13 మంది మృతి: భవనంలో మంటలతో మృత్యువాత
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిలడెల్పియాలో గల మూడు అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 13 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది అంటున్నారు. ఇద్దరిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. తన 35 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదం చూడలేదని ఫైర్ ఆఫీసర్ తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటివరకు తెలియరాలేదు. దీనిపై విచారణ జరుగుతుందని తెలిపారు. భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నాయి.. కానీ అవీ పనిచేయడం లేదని తెలిపారు. భవనం ఫిలడెల్పియా పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందినది. భవనంలో గల రెండో అంతస్తు నుంచి మంటలు వ్యాపించాయి. తొలుత పొగ వచ్చింది.

Recommended Video
భవనంలో 26 మంది ఉంటున్నారు. 8 మంది ఫస్ట్ ప్లోర్.. 18 మంది సెకండ్, మూడో ప్లోర్‌లో ఉంటున్నారు. ప్రమాదం జరిగే సమయానికి ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. మంటలు రావడంతో చుట్టు పక్కల వారు భయపడ్డారు.












Click it and Unblock the Notifications