మళ్లీ ఉలిక్కిపడ్డ లండన్: సెవెన్ సిస్టర్స్ రోడ్డులో భీభత్సం.. పాదచారుల పైకి దూసుకెళ్లిన వ్యాన్

Subscribe to Oneindia Telugu

లండన్: లండన్ బ్రిడ్జిపై ఉగ్రవాదులు సృష్టించిన భీభత్సాన్ని మరిచిపోకముందే.. నగరంలోని సెవెన్ సిస్టర్స్ రోడ్డులో మరో దారుణం చోటు చేసుకుంది. పాదచారుల పైకి వ్యాన్ వేగంగా దూసుకెళ్లడంతో.. 22మంది వరకు గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

లండన్ లో ఉగ్రదాడి: ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు

లండన్ లోని ఫిన్స్‌ బరీ పార్క్‌ లోని సెవెన్‌ సిస్టర్‌ రోడ్డులో.. రాత్రిపూట ముస్లింలు నిర్వహించే తరావీ ప్రార్థనల అనంతరం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.22నిమిషాల సమయంలో జరిగిన ఈ ఘటనతో లండన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Several injured after vehicle rams people leaving London mosque: witnesses

రంగంలోకి దిగిన లండన్ మెట్రో పోలీసు, అత్యవసర సహాయక బృందాలు భ్రదతను కట్టుదిట్టం చేశాయి. సెవెన్ సిస్టర్స్ రోడ్డును తాత్కాళికంగా మూసివేశాయి. ఘటనలో ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్న పోలీసులు.. ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Several people have been injured after a vehicle was driven into a crowd of pedestrians in north London early Monday.
Please Wait while comments are loading...