వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక ఆరోగ్యం: క్లిటోరిస్ అంటే ఏంటి? సెక్స్‌లో మహిళల లైంగిక ఆనందానికీ, దీనికీ లింకేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎడమ క్లిటోరిస్, కుడి పెనిస్

ఈ చిత్రాన్ని చూసినప్పుడల్లా నాకు తెలీకుండానే 'వావ్' అనిపిస్తుంది

పైనున్న లిలాక్ పింక్ టోన్ డ్రాయింగ్‌లో మీరు ఒక క్లిటోరిస్, పురుషాంగం పక్కపక్కనే ఉండడం చూడచ్చు.

ఈ కథనం రాయాలని నా పరిశోధన ప్రారంభించినరోజే నేను ఈ ఫొటోను నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను. ఆ రోజు నుంచీ నాతో మాట్లాడే ప్రతి ఒక్కరి ప్రతిస్పందన చూడ్డానికి నాకు దాన్ని చూపించే అవకాశం దొరికింది.

వారందరూ ఎంత వరకూ చదివారు, వారికి ఎంత తెలుసు, వారి మత విశ్వాసాలు, వృత్తి ఏంటి అనేది ఏదీ నేను చూడలేదు. ఆ ఫొటోను చూస్తున్న వారు ఆడా, మగా అనేది కూడా పట్టించుకోలేదు.

కానీ, వారిలో చాలా మంది ఆ ఫొటోలో కనిపిస్తోంది ఏంటో తెలుసుకోలేకపోయారు. కనీసం వాటి ఆకారం చూసయినా ఆ రెండింటికీ ఒక అద్భుతమైన సారూప్యత ఉందే అనే విషయం గుర్తించలేదు.

ఆ ఫొటోలో ఏమున్నాయి అనేది వారు ఎందుకు తెలుసుకోలేకపోయారో మనం అర్థం చేసుకోవచ్చు.

పురుషుల జననేంద్రియాల గురించి విస్తృత సమాచారం అందుబాటులో ఉన్నా, క్లిటోరిస్(గ్రీకులో kleitoris అంటే చిన్న పర్వతం అని అర్థం) వివరాలు మాత్రం చరిత్ర అంతటా వైద్య సాహిత్యంలో కనిపిస్తూ, మాయమవుతూ వచ్చాయి.

2005లో ఆస్ట్రేలియా యూరాలజిస్ట్ హెలెన్ ఒకానెల్ ముందుకొచ్చి, దీని గురించి చెప్పేవరకూ ఆ పరిస్థితి అలాగే ఉంది. ఆమె మొట్టమొదట ఈ అవయవం పూర్తి శరీర నిర్మాణం గురించి వర్ణించారు. దానితోపాటూ ఆ అవయవం పక్కనే ఉండే మూత్రనాళం, యోని, గ్రంథులు, మిగతా వాటితో దానికున్న లింకు గురించి కూడా వివరించారు.

క్లిటోరిస్ గురించి సరైన పాఠ్యాంశాలు లేని సమయంలో ఒకానెల్ దానిని క్షుణ్ణంగా పరిశోధించడం మొదలెట్టారు.

ఒక చిన్న భాగంగా మాత్రమే చూసే ఆ అవయవం గురించి తెలుసుకోడానికి మృతదేహాలను కోసి పరీక్షించడం, సజీవంగా ఉన్న మహిళల మాగ్నెటిక్ రిసొనన్స్ ఇమేజింగ్, కణజాలాల సైటోలాజికల్ అధ్యయనాలు చేశారు. క్లిటోరిస్‌లో దాదాపు 90 శాతం భాగం మహిళల శరీరం లోపలే ఉంటుందనేది ఆమె గుర్తించారు.

ఆకారం కారణంగా చాలా మంది క్లిటోరిస్‌ను ఆర్కిడ్ పువ్వుతో పోలుస్తారు

క్లిటోరిస్ అనాటమీ

క్లిటోరిస్‌ అని మనం అనుకునే, మనకు కనిపించే భాగం నిజానికి 'టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్' అని బాస్క్ సైకాలజిస్ట్, సెక్సాలజిస్ట్, లారా మోరాన్ బీబీసీకి వివరించారు.

ఆమె తన 'ఆర్గాన్స్(మిత్స్)' అనే పుస్తకం ద్వారా మనుషుల లైంగితక గురించి ఉన్న తప్పుడు అభిప్రాయాలు, అపోహలు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.

"అది క్లిటోరిస్ శీర్షం మాత్రమే(అది అంతరోష్ఠాలు కలిసేచోట లోపల కనిపించకుండా ఉంటుంది) మిగతా అవయవం మొత్తం అంతర్గతంగా ఉంటుంది. కనిపించే ప్రాంతం బయట క్లిటోరిస్ చర్మం కింద ఉంటుంది" అని మోరాన్ చెప్పారు.

స్థూపాకారంలో ఉండే దీని మొదలు రెండు కార్పోరా కావెర్నోసాతో ఉంటుంది. అది పొత్తి కడుపు కింద ఉన్న బోలు వైపు విస్తరించి ఉంటుంది.

చివరన దాని మూలాలు, అంగస్తంభన కణజాలానికి సంబంధించిన పలచటి నరాలు ఉంటాయి. అవి మెదడు నుంచి నడుము ఎముకల మీదుగా వెళ్లి మూత్రనాళం, యోని చుట్టూ ఉంటాయి.

ప్రతి మూలానికీ పక్కనే అంగస్తంభన కణజాలం ఉండే మరో ప్రాంతం ఉంటుంది దీనిని క్లిటోరల్ బల్బ్స్ అంటారు. అవి యోని గోడల వెనుక ఉంటాయి.

"నిజానికి క్లిటోరిస్ అంటే యోని గోడలే" అని ఒకానెల్ 2006లో బీబీసికి చెప్పారు.

క్లిటోరిస్ త్రీడీ

పోలికలు, తేడాలు

రెండింటికీ సారూప్యతలు ఉండడం వల్ల, పురుషాంగంతో పోల్చి చెప్పినపుడు క్లిటోరిస్ ఆకారం గురించి మరింత బాగా అర్థం చేసుకోవచ్చు.

ఈ రెండింటినీ హోమోలోగస్ ఆర్గాన్స్(సంగత అవయవాలు) అంటారు. అవి ఒకే మూలాన్ని కలిగి ఉంటాయి. అవి చేసే పనులు భిన్నంగా ఉన్నప్పటికీ, వాటి అంతర్గత నిర్మాణం మాత్రం ఒకేలా ఉంటుంది.

మహిళలో క్లిటోరిస్ సగటు పరిమాణం దాదాపు పది సెంటీమీటర్లు ఉంటుంది. పురుషాంగం లాగే దీనిలోని కణజాలం కూడా మెత్తగా, అంగస్తంభనకు గురయ్యేలా ఉంటుంది. అంటే రక్త ప్రవాహం వల్ల ఉద్వేగానికి గురైనప్పుడు అది ఉబ్బడం, పెద్దదవడం జరుగుతుంది.

"కొందరు క్లిటోరిస్‌ను అంతర్గత పురుషాంగంగా చెబుతారు. కానీ, పురుషాంగం అంటే ఒక బాహ్య క్లిటోరిస్ అని మరికొందరు అంటారు. అందుకే నేనే దీన్ని స్వయంగా వివరించాలనుకుంటున్నా" అని లారీ మింట్జ్ చెప్పారు.

ఆమె ఒక సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, 'బికమింగ్ క్లిటెరేట్' అనే పుస్తకం కూడా రాశారు.

పురుషులు, మహిళలు అనుభూతి పొందే లైంగికానందం మధ్య ఉన్న అంతరాలను శాశ్వతంగా అలాగే ఉంచేసేలా సాయం చేస్తున్న సాంస్కృతిక అంశాలను ఇది బట్టబయలు చేస్తుంది.

లైంగికానందం

మహిళల నకిలీ భావప్రాప్తికి ఎన్నో కారణాలు

బాహ్య, అంతర్గత అనే విషయం పక్కన పెడితే పురుషాంగానికి రెండు పనులు ఉంటాయి. లైంగిక పునరుత్పత్తి, మూత్ర వ్యవస్థలో అది ఒక భాగం. మరోవైపు క్లిటోరిస్‌కు మాత్రం ఒకే పని ఉంటుంది. బహుశా మనిషి శరీరంలో ఆనందాన్ని అందించే ఒకే ఒక పని చేసే ఏకైక అవయవం ఇదే.

క్లిటోరిస్‌లో దాదాపు 8 వేల నరాలు చివరలు ఉంటాయి. పురుషాంగంలో అవి 4 వేల నుంచి 6 వేల మధ్య ఉంటాయి.

మన శరీరంలో నరాల చివర్లు అత్యంత దట్టంగా ఉండే ప్రాంతం ఇదేనని మింట్జ్ వివరించారు.

"అన్ని నరాలూ పురుషాంగం చివరన ఉండడం ఊహించుకోండి. ఉదాహరణకు అవి దాని చివరలో ఒక పెన్సిల్ ఎరేజర్ సైజులో ఉంటాయి" అని ఆమె చెప్పారు.

గర్భంలో శిశువు

మూలం ఒకటే

క్లిటోరిస్, పురుషాంగానికి అన్ని సారూప్యతలు ఎందుకుంటాయి అనడానికి ఒక కారణం ఉంది. తల్లి గర్భంలో పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో అవి ఒకే జననేంద్రియ గడ్డ నుంచి ఏర్పడతాయి.

పిండాలు తమ సెక్స్ క్రోమోజోమ్స్ స్పష్టం చేయడం ప్రారంభించినప్పుడు, ఆరు లేదా ఏడో వారంలో మాత్రమే జననాంగాల్లో తేడాలు వస్తాయి.

అప్పటి నుంచి XY పిండాల్లో విడుదలయ్యే టెస్టోస్టిరాన్ మగ జననాంగాలు ఏర్పడడానికి కారణం అవుతుంది.

XX పిండాల్లో సెక్స్ హార్మోన్లు లేకపోవడం వల్ల ఆడ జననాంగాలు ఏర్పడడానికి కారణం అవుతుంది.

ఒకరిలో అవి బయటకు పెరిగితే, ఇంకొకరిలో అవి లోపలికి పెరుగుతాయి.

అవగాహనాలోపం

క్లిటోరిస్ శారీరక నిర్మాణం, దాని పనుల గురించి ఉన్న అజ్ఞానం వల్లే మగతనం అనే భావనకు, పితృస్వామ్యానికి, స్త్రీ లైంగిక ఆనందం విలువను తగ్గించడానికి కారణం అని మోరాన్, మింట్జ్ ఇద్దరూ భావిస్తున్నారు. దానివల్ల మహిళల లైంగిక జీవితం కూడా ప్రభావితం అవుతోందని వారు చెప్పారు.

"ఆ అజ్ఞానం మహిళలు తమ లైంగికానందం కోల్పోయేలా చేస్తోంది. ఇది కారెలా నడపాలో తెలీనివారికి, ఒక కార్ ఇవ్వడం లాంటిదే. అలాంటప్పుడు మీరు దాన్ని ఆస్వాదించలేరు" అంటారు మోరాన్.

"ఆ అవగాహనా లోపం మనల్ని నిరాశకు గురిచేస్తుంది. ఎందుకంటే, వాళ్లు మనకు కారిచ్చారు, ఎలా ఉపయోగించాలో కూడా మనకు చెబుతారు. కానీ అది సంప్రదాయ పోర్న్ లేదా రొమాంటిక్ సినిమాల్లో లాగే ఉండాలంటారు. అందుకే మనకు అక్కడ క్లిటోరల్ స్టిములేషన్ కనిపించదు" అన్నారు.

"అక్కడ ఎప్పుడూ చొప్పించడం మాత్రమే ఉంటుంది. అంగప్రవేశం అనేది క్లిటోరిస్‌ను ఉత్తేజపరిచే పద్ధతి కాదు. అలా సులభంగా భావప్రాప్తి పొందడం జరగదు" అన్నారు.

మరోవైపు, "క్లిటోరిస్‌ను ప్రేరేపించడం ద్వారా తమకు లైంగికానందం, భావప్రాప్తి కలుగుతుందనే విషయం మహిళలే స్వయంగా అన్వేషించి తెలుసుకుంటే, అది మంచి లక్షణం కాదని వర్ణిస్తున్నారు" అని మోరాన్ అంటున్నారు.

"అవును, నేను భావప్రాప్తి పొందుతాను, కానీ వాళ్ల (మగవారి) పుట్టుకలోనే ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తోంది. నన్ను నేను చేత్తో ప్రేరేపించుకుంటేనే భావప్రాప్తి కలుగుతుంది" అని కొంతమంది మహిళలు నాతో అన్నారు.

"కొందరికి అక్కడ క్లిటోరిస్ ఉందని తెలీకపోవడమే కాదు, సులభంగా భావప్రాప్తి కలిగించే అవయవం అదేననే విషయం కూడా వాళ్లకు తెలీదు" అంటారు మోరాన్.

లైంగిక విద్య

లైంగిక విజ్ఞానం

మహిళలకు కూడా తమ శరీర నిర్మాణం గురించి అవగాహన లేకపోవడం వల్ల కూడా వారు పురుషులతో సమానంగా లైంగికానందం పొందలేకపోతున్నారని మింట్జ్ అంగీకరిస్తున్నారు.

''దురదృష్టవశాత్తూ చాలా మంది మహిళలకు వారు చూడగలిగే, తాకగలిగే.. క్లిటోరిస్ శక్తి ఏంటనేది ఇప్పటికీ తెలీడం లేదు. లేదంటే, అది అంత ముఖ్యమైనది కాదని వారు అనుకుంటున్నారు" అని ఆమె వివరించారు.

కానీ, మనం మన సంస్కృతిలో ఉపయోగించే భాష కూడా ఈ పరిస్థితిని ప్రతిబింబిస్తుందని, ఆ తేడాను శాశ్వతం చేస్తుందని సెక్సాలజిస్టులు భావిస్తున్నారు.

"మనం సంభోగానికి ముందు జరిగే ప్రతిదానినీ 'ఫోర్‌ప్లే' అంటాం. అంటే, అది మెయిన్ ఈవెంట్‌కు ముందు ప్రిలిమనరీస్‌లా అనుకోవాలి. కనీసం, అలా చేసినా అది చాలా మంది మహిళలు భావప్రాప్తికి చేరువయ్యేలా చేస్తుంది" అని మింట్జ్ చెప్పారు.

ఈ పరిస్థితి మారాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరమని ఆమె చెబుతున్నారు.

"నెదర్లాండ్స్‌లోలాగే లైంగికానందం, సమ్మతి గురించి నేర్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ దాని వల్ల లైంగిక దాడులు తక్కువగా జరుగుతున్నాయి. లైంగికానందం పొందే పురుషులు, మహిళల్లో కూడా మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ అంతరం ఉంది" అని చెప్పారు.

మోరాన్ కూడా లైంగిక విజ్ఞానం చాలా కీలకం అంటున్నారు.

"ఏ అవయవం దేనికోసం, మనం వాటితో ఏం సాధించవచ్చు, వాటిని ఎలా ఉత్తేజపరచాలి అనేది తెలుసుకోవడం వల్ల, అది మనందరికీ సంతోషాన్ని అందిస్తుంది" అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Sexual Health: What is Clitoris? What is the link between women's sexual pleasure in sex
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X