బంగ్లాదేశ్ బరితెగింపు- షేక్ హసీనాపై..

Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పదవీచ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్ హసీనాపై భారీగా నేరారోపణలను మోపింది. దేశద్రోహం సహా హత్య కేసులు ఇందులో ఉన్నాయి. బంగ్లాదేశ్ లో కొనసాగిన అల్లర్లకు ఆమెను బాధ్యురాలిని చేసిందక్కడి ప్రభుత్వం.

గత ఏడాది హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో అట్టుడికింది బంగ్లాదేశ్. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వచ్చాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి మాత్రం చాలాకాలం పాటు బ్రేకులు పడలేదు.

Sheikh Hasina has been charged with several cases

గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. అల్లర్లకు పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెకు ఉద్వాసన పలికింది ఆ దేశ పార్లమెంట్. పదవీచ్యుతురాలిని చేసింది.

అప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు కొనసాగాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి. హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడ్డారు. ఇస్కాన్ ప్రతినిధి, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జొటె నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేయడం దీనికి పరాకాష్ఠగా మారింది.

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో చెలరేగిన ఆందోళనకారులను సామూహికంగా మట్టుబెట్టడానికి షేక్ హసీనా ప్రయత్నించారనే ఆరోపణలను తాజాగా తెరమీదికి తీసుకొచ్చింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఆందోళనకారులను అణచివేయాలని, వారిని మట్టుబెట్టాలని షేక్ హసీనా.. భద్రత అధికారులు, పోలీసులతో పాటు పార్టీ ఆవామీ లీగ్ కార్యకర్తలను సైతం ఆదేశించారని పేర్కొంది.

ఈ మేరకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కు దర్యాప్తు నివేదికను సమర్పించింది. ప్రభుత్వం తరఫున చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తాజులు ఇస్లామ్ ఈ నివేదికను అందజేశారు. ప్రజా తిరుగుబాటును అణిచివేయడానికి షేక్ హసీనా చట్టబద్ధ సంస్థలు, పార్టీని వినియోగించుకున్నారని వివరించారు.

సామూహిక తిరుగుబాటు సమయంలో ఆందోళనకారులు, విద్యార్థులను హత్య చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రోత్సాహించారని, వారిని అన్ని రకాలుగా రెచ్చగొట్టారని అన్నారు. హత్యపూరక ప్రణాళికలకు ఆమె ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందించారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+