Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవినీతి కేసులో షేక్ హసీనాకు 21 ఏళ్ల జైలుశిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. మూడు అవినీతి కేసుల్లో ఢాకా న్యాయస్థానం గురువారం ఆమెకు 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. రాజధాని డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన పూర్బచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక శాఖ ఈ మూడు కేసులను నమోదు చేయగా.. షేక్ హసీనాకు ఒక్కో కేసులో ఏడేళ్ల చొప్పున మొత్తం 21 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఎలాంటి దరఖాస్తు లేకుండానే షేక్ హసీనాకు స్థలం కేటాయించబడిందని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఈ కేసుల్లో షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజేద్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక లక్ష టాకాల(బంగ్లాదేశ్ కరెన్సీ) జరిమానా విధించబడింది. అలాగే ఆమె కుమార్తె సైమా వాజేద్ కు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించబడింది. అవినీతి కమిషన్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై మొత్తం ఆరు వేర్వేరు కేసులను దాఖలు చేసింది. మిగిలిన మూడు కేసుల్లో తీర్పు డిసెంబర్ 1న ప్రకటించబడుతుంది.

Sheikh Hasina Sentenced to 21 Years in Jail in Corruption Cases

అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణశిక్ష
అవినీతి కేసుల తీర్పు కంటే ముందే బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) షేక్ హసీనాకు మరో కేసులో మరణశిక్ష విధించింది. 2024 జులైలో ప్రభుత్వంపై జరిగిన విద్యార్థి నేతృత్వంలోని నిరసనలు, ఆందోళనలను అణచివేయడానికి హసీనా ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు జరిగిన హింసకు ఆమె దోషిగా తేలారు. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయి ఉండటంతో నిందితులు హాజరు కాకుండానే కోర్టు తీర్పును ప్రకటించింది. విచారణ సమయంలో వారికి న్యాయపరమైన ప్రాతినిధ్యం కూడా లేదు.

భారత్‌కు అప్పగింత అభ్యర్థన
షేక్ హసీనా గత సంవత్సరం (2024 జులైలో) విద్యార్థి తిరుగుబాటు కారణంగా ప్రధానమంత్రి పదవిని కోల్పోయి, ఆగస్టు 5న దేశం విడిచి పారిపోయి భారత్‌లో ఆశ్రయం తీసుకున్నారు. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. హసీనాకు ఐసీటీ మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అధికారికంగా అభ్యర్థించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం మాట్లాడుతూ.. ఢాకా నుంచి అభ్యర్థన అందినట్లు ధ్రువీకరించారు. ఆ అభ్యర్థనను భారత సర్కారు ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+