భార్యపై కోపంతో ఆయన ఏం చేశాడంటే, తర్వాత తాను కూడ ...
తనతో గొడవపడి విడిపోయిన భార్యపై కక్ష పెంచుకొన్న భార్యను చంపాడు. ఆమెతో పాటు మరో పదకొండు మందిని హత్య చేశాడు ఆ కిరాతకుడు.
సోవొపోలో :తనతో గొడవపడి విడిపోయిన భార్యపై కక్ష పెంచుకొన్న భార్యను చంపాడు. ఆమెతో పాటు మరో పదకొండు మందిని హత్య చేశాడు ఆ కిరాతకుడు. న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్న వారిపై అతను విచక్షణరహితంగా కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ ఘటన బ్రెజిల్ లోని కాంపినస్ పట్టణంలో చోటుచేసుకొంది.
ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న సిడ్నే రమిస్ డి అరజో తో ఆయన భార్య కొద్దికాలం క్రితం విడిపోయింది. భర్తతో గొడవపడి ఆమె ఆయన నుండి విడిపోయి కొడుకుతో కలిసి వేరే ఇంట్లో నివసిస్తోంది.అయితే ఆమెపై ఆయన కక్ష పెంచుకొన్నాడు.
భార్యను చంపాలని ముందుగానే అనుకొన్నాడు. ఈ మేరకు న్యూ ఇయర్ పార్టీ వేడుకలను అనువైందని ఎంచుకొన్నాడు. ఈ మేరకు న్యూఇయర్ వేడుకల్లో భార్యను అంతం చేయాలని భావించి తుపాకీ,అదనపు బుల్లెట్లు, కత్తి, పేలుడు పదార్థాలను సమకూర్చుకొన్నాడు.

దగ్గరి బంధువులతో ఆమె తన ఇంట్లోనే న్యూఇయర్ పార్టీ చేసుకొంటుండగా పెన్సింగ్ దూకి ఇంట్లోకి వచ్చిన రమిస్ పార్టీలో ఉన్నవారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. మాజీ భార్య, కొడుకు సహ పదకొండు మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.తర్వాత ఆయన కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
రమిష్ కాల్పుల బారి నుండి తప్పించుకొన్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా టపాకాయలు కాల్చే శబ్దం అనుకొన్నారని ఇరుగుపొరుగు వారు భావించారు. అయితే పోలీసులు రావడం, గాయాలతో ఇంట్లో నుండి బయటకు కొందరు పరుగులు తీయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications