అమెరికాలో గే క్లబ్ కాల్పులు: 50 మంది మృతి

మియామీ: అమెరికాలోని ఓ గే నైట్ క్లబ్‌లో నెత్తురోడింది. ఓ సాయుధుడు లోనికి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఫ్లోరిడాలోని ఓర్లాండో పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పాప్ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీని కాల్చిచంపిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరం.

సెంట్రల్ ఫ్లోరిడా ఒర్లాండ్ సిటీలోని గే నైట్‌క్లబ్‌లో ఉన్మాది ఒమర్ సద్దిఖీ మతీన్ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు. 53 మంది గాయపడ్డారు. క్లబ్‌ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఒమర్ సద్దిఖీ మతీన్‌ను కాల్చి చంపేశాయి. అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మృతులకు సంతాపం తెలిపింది. 29 సంవత్సరాల ఒమర్ సద్దిఖీ మతీన్‌ ఫ్లోరిడా, ఫోర్ట్ పియర్స్ ప్రాంతానికి చెందినవాడు.

ఓర్లాండో హాటెస్ట్ గే బార్‌గా తన వెబ్‌సైట్‌లో ప్రచారం చేసుకునే పల్స్ నైట్ క్లబ్‌లో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామను 2 గంటల ప్రాంతంలో సాయుధుడు నైట్ క్లబ్‌లోని వారందరినీ నిర్బంధించాడు. పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకుని పేలుడు పదార్థాలతో ఎదురుదాడికి దిగారు. బియర్ కాట్ అనే వాహనంతో గోడను పగులగొట్టారు.

భవనాన్ని తాము ఖాళీ చేసామని, షూటర్‌తో పాటు 50 మంది మరణించారని, మరో 53 మంది ఆస్పత్రి పాలయ్యారని ఓర్లాండో మేయర్ బుడ్డీ డైయర్ మీడియాకు చెప్పారు. దేశ చరిత్రలో అత్యంత దారుణమైన మాస్ షూటింగ్స్‌లో ఇదొకటని ఓర్లాండో చీఫ్ జాన్ మీనా అన్నారు.

పథకం ప్రకారం వ్యవస్థీకృతమైన దాడిగా ఇది కనిపిస్తోందని అన్నారు. కాల్పులకు తెగబడిన సాయుధుడు మతీన్‌కు నేర చరిత్ర లేదని సిబిఎస్ న్యూస్ రిపోర్టు తెలిపింది. మృతులంతా సాయుధుడి కాల్పుల్లోనే మరణించారా, పోలీసుల ఎదురుదాడిలో ఎవరైనా మరణించారా అనేది తేలాల్సి ఉంది.

లాటిన్ నైట్ ఉత్సవాల సందర్భంగా పల్స్‌లో 300 మందికి పైగా గుమిగూడారు. ఆ సమయంలో సాయుధుడు లోనికి ప్రవేశించాడు. దాదాపు మూడు గంటల పాటు వారంతా సాయుధుడి బందీలుగా ఉన్న తర్వాత ఉదయం 5 గంటల ప్రాంతంలో బందీలను రక్షించేందుకు పోలీసులు పూనుకున్నారు.

నైట్ క్లబ్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సాయుధుడు మతీన్ అమెరికా పౌరుడని తేలింది. ఆటోమేటిక్ హ్యాండ్ గన్‌తోనూ రైఫిల్ 16తోనూ అతను కాల్పులు జరిపినట్లు గుర్తించారు.

'చాలా మంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది మృతి చెందారో తెలియరాలేదు' అని ఓ పోలీసు అధికారి తొలుత తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. క్షణాల వ్యవధిలోనే క్షతగాత్రులందర్నీ ఆస్ప్రతికి తరలించారు.

jail

ఆ క్లబ్ భవనం నుంచి అందర్నీ బయటికి పంపినట్లు తెలిపారు. తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. దీంతో సుమారు 20మంది మరణించారని మొదట చెప్పారు. కానీ అది 50కి పెరిగింది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు కొందర్ని అదుపులోకి తీసుకుని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో పోలీసులు వెనుకంజ వేశారు. కాల్పులకు తెగబడ్డానికి కారణమెంటో తెలియరాలేదని పోలీసులు చెప్పారు. చివరకు అతను పోలీసుల చేతుల్లో హతమయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+