స్కూల్‌లో కాల్పులు: పలువురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియా బారూ కౌంటీలోని ఓ హైస్కూల్‌లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇందులో నలుగురు మృతి చెందడతోపాటు పలువురు గాయపడినట్లు సమాచారం. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు.
ఘటనా స్లలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది.. పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విద్యార్థులను సమీపంలోని ఫుట్ బాల్ స్టేడియంలోకి తరలించారు. అనంతరం ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరా తీశారు.

ఈ ఘటనపై జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'అపాలాచీ హైస్కూల్‌లో జరిగిన సంఘటనపై ప్రతిస్పందించడానికి నేను అందుబాటులో ఉన్న అన్ని రాష్ట్ర వనరులను ఆదేశించాను. బారో కౌంటీలో, రాష్ట్రవ్యాప్తంగా ఆ తరగతి గదులలో ఉన్న వారి భద్రత కోసం ప్రార్థించడంలో జార్జియాలోని అందరినీ నా కుటుంబంతో చేరమని కోరుతున్నాను' అని గవర్నర్ కెంప్ పేర్కొన్నారు.
The numbers are growing. Please say a prayer for everyone at Apalachee High School in Barrow County, Georgia. These things have to stop. 4 lives lost and 9 injured. #EnoughIsEnough https://t.co/SUGAr5DfR7
— Erin Lahey (@erin_lahey) September 4, 2024
'మేము సమాచారాన్ని సేకరించి, ఈ పరిస్థితికి మరింత ప్రతిస్పందనగా మేము స్థానిక, రాష్ట్ర, సమాఖ్య భాగస్వాములతో కలిసి పని చేయడం కొనసాగిస్తాము' అని కెంప్ జోడించారు. మరోవైపు, అట్లాంటాలోని ఎఫ్ బీఐ కార్యాలయం కూడా ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు జరుపుతోంది.












Click it and Unblock the Notifications