అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - అయిదుగురు మృతి ..!!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. ఒక్లహామాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రి క్యాంపస్‌లోని మెడికల్ బిల్డింగ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నిందితుడు కూడా ఉన్నాడు. ఓక్లహోమాలోని తుల్సా నగరంలో ఓ వ్యక్తి తుపాకీతో చెలరేగాడు. ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయి. మంగళవారం.. న్యూ ఒర్లీన్స్‌లో ఓ పాఠశాల స్నాతకోత్సవంలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఈశాన్య లూసియనా వర్సిటీలో జరిగిన పాఠశాల స్నాతకోత్సవంలో కాల్పులు జరిగి నలుగురు గాయపడిన ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మరోమారు తుపాకీ పేలటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో 10 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడు ఆర్థోపెడిక్ సర్జన్ కోసం ఆసుపత్రికి వచ్చినట్టు సమాచారం. ఆసుపత్రిలో వైద్యుడు కనిపించలేదని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటన వైద్యుడు సహా ఇద్దరు నర్సులు మృతిచెందారు. అయితే, కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓక్లహోమాలోని తుల్సాలో జరిగిన కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై స్థానిక అధికారులతో చర్చిస్తున్నామని, నిశితంగా పర్యవేక్షిస్తున్నామని శ్వేత సౌధ వర్గాలు తెలిపాయి. ఇటీవలే అమెరికాలో సాల్వడార్ రామోస్(18) మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులకు దిగాడు. 19 మంది స్టూడెంట్లతో పాటు ఇద్దరు టీచర్లను పొట్టన పెట్టుకున్నాడు. టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియోకు 134 కిలోమీటర్ల దూరంలోని ఉవాల్డే టౌన్‌లో ఈ దారుణం జరిగింది. హంతకున్ని సాల్వడార్ రామోస్ అనే స్థానికునిగా గుర్తించారు. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనల పైన ఆందోళన వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications