వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్ పార్లమెంటులో ఉగ్ర కాల్పులు: ఏడుగురు మృతి, పలువురి నిర్బంధం

|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: ఇరాన్ పార్లమెంటులో బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు గాయాలయ్యాయి. పార్లమెంటులోకి ప్రవేశించిన ఉగ్రవాది.. పలువురిని నిర్బంధించినట్లు తెలిసింది.

'ఓ దుండగుడు ఇరాన్ పార్లమెంటులోకి ప్రవేశించాడు. ఆ వెంటనే కాల్పులకు తెగబడ్డాడు. దీంతో సెక్యూరిటీ గార్డు తీవ్రగాయాలపాలయ్యాడు' అని స్థానిక మీడియా కథనాలు వెలువరించాయి.

Shooting incident in Iran parliament; 1 injured

ఘటన జరిగిన వెంటనే అక్కడికి భారీగా భద్రతా దళాలు చేరుకున్నాయి. ఉగ్రవాది కోసం వేటను ముమ్మరం చేశాయి. పలువురు బంధీలుగా ఉండటంతో జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎనిమిది మంది మృతి

కాగా, పార్లమెంటుతోపాటు మెట్రో స్టేషన్ సమీపంలో, దక్షిణ టెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమిని మ్యూజియం సమాధి సమీపంలోనూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ కాల్పులు, పేలుళ్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఓ ఉగ్రవాదిని భద్రతాదళాలు కాల్చి చంపగా, మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి.

కాగా, ఖోమిని మ్యూజియం సమాధి వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఓ మహిళ ఉగ్రవాదని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనల్లో క్షతగాత్రుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రవేశించిన ఉగ్రవాదులు ఏకే-47 తుపాకులు, కోల్ట్‌ పిస్తోల్‌ను కలిగి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇరాన్‌లో చాలా కాలం తర్వాత మళ్లీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకోవడంతో భద్రతా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ దాడికి కుట్ర పాకిస్థాన్‌లో జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

దాడి చేసింది మేమే: ఐస్ఐఎస్

ఇరాన్ పార్లమెంటు, కమెయినీ సమాధి, మెట్రో స్టేషన్ సమీపం ప్రాంతాల్లో కాల్పులు, పేలుళ్లతో విరుచుకుపడి 8మంది ప్రాణాలు బలిగొన్నది తామేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడి తమ వారి పనేనని ఐసీస్ కు చెందిన వార్తా సంస్థ అమాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

English summary
One security gurad was injured in a shooting reported inside Iran parliament on Wednesday. Initial reports say likely hostage situation insaide the parliament. Two semi-official Iranian news agencies, Fars and Mehr, Reported Reuters news agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X