viral:పిల్లలను చంపేయాలా..? ధరల వాతపై పాక్ మహిళ ఆక్రందన, వీడియో వైరల్
అన్నమో రామచంద్రా.. అవును ఈ సమస్త భూ ప్రపంచం మీద అన్న, పానీయలే ముఖ్యం. యావత్ ప్రపంచంలో జనం.. బతికేది జానెడు పొట్ట కోసమే.. కూటి కోసమే కోటి విద్యలు అని పెద్దలు ఊరికే అనలేదు. అయితే మన పొరుగు దేశం.. పాకిస్థాన్‌లో కూడా ధరల వాత ఉంది. అక్కడి జనం కూడా ఇబ్బందికి గురవుతున్నారు. ఓ వివాహిత వీడియో తీసి తన కోపాన్ని ప్రదర్శించింది.

పిల్లలను ఏం చేయాలి
కరాచీకి చెందిన వివాహిత వీడియో చేసింది. ఆమె పేరు రాబియా.. దానిని జర్నలిస్ట్ హమీద్ మిర్ ట్వీట్ చేశారు. ఇల్లు కిరాయి, కరెంట్ బిల్లు, ఇతర పన్నులు కడుతుంది. దీంతో తనకు మిగిలేది ఏంటీ.. తన పిల్లలకు ఏం పెట్టాలని అడుగుతుంది. ఇల్లు కిరాయి రూ.20 వేలు, కరెంట్ బిల్లు రూ.15 వేల వరకు వచ్చిందని తెలిపింది. 556 యూనిట్లకు కరెంట్ బిల్లు వచ్చిందని తెలిపింది. గత 4 నెలలుగా మూర్చ వ్యాధితో బిడ్డ బాధపడుతున్నాడట. ఆ మందుల ఇతర ఖర్చులు ఉండవా అని అడిగారు.

కిరాయి.. కరెంట్ బిల్లు
కిరాయి ఇవ్వాలా.. కరెంట్ బిల్లు ఇవ్వాలా..? సరుకులు తీసుకోవాలా అని అడిగింది. పిండి, పప్పు, పంచదారా, నెయ్యి కొనుగోలు చేయడానికి నగదు కేటాయించాలని అడిగింది. విలాస వస్తువులు కొనుగోలు చేసే స్థాయిలో తాను లేనని.. మరీ తన పిల్లలను ఏం చేయాలి.. చంపాలా అని అడిగింది. దేశంలోని పరిస్థితులకు ప్రధాని కారణం అని మండిపడ్డారు. వారు అల్లాకు కూడా భయపడటం లేదని విమర్శించారు.

పరిస్థితి ఇదీ
వీడియో గురించి ఆర్థికమంత్రి మిఫ్తా ఇస్మాయిల్ స్పందించారు. జూన్ నెలలో విద్యుత్‌పై టారిఫ్ పెంచలేదని.. మందులపై కూడా కొత్తగా పన్నులు వేయలేదని తెలిపారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పరిస్థితి సరిగ్గా లేవని తెలిపారు. నగదు నిల్వలు తగ్గాయని.. ద్రవ్యోల్బణంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతుందని వివరించారు.
کراچی سے تعلق رکھنے والی ایک ماں نے حکمرانوں کو اپنا بجلی کا بل اور کچن کے لئے اشیاء کی خریداری کا بل دکھا کر کچھ سوال پوچھے میں نے یہ سوال مفتاح اسماعیل کو بھیج دئیے مفتاح صاحب نے جواب بھجوا دیا ہے لیکن پہلے ایک ماں کا دکھڑا سن لیں pic.twitter.com/THahmjAjUL
— Hamid Mir (@HamidMirPAK) August 9, 2022
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications