ఘోరం: మట్టిచరియలు విరిగిపడి.. 600 మంది కనిపించకుండా పోయారు!
ఆఫ్రికాలో ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడి సియెర్రా లియోన్ లో భారీ వరదల కారణంగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు 600 మంది స్థానికులు కనిపించకుండా పోయారు.
ఫ్రీటౌన్: ఆఫ్రికాలో ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడి సియెర్రా లియోన్ లో భారీ వరదల కారణంగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు 600 మంది స్థానికులు కనిపించకుండా పోయారు.
వరదల కారణంగా ఆఫ్రికా రాజధాని ఫ్రీటౌన్ చాలా వరకు అస్తవ్యస్తమైంది. ఆ దేశాధ్యక్షుడు ఎర్నెస్ట్ బాయ్ కొరోమా తమకు అత్యవసర సహాయం అందించాల్సిందిగా ప్రపంచ దేశాలను అభ్యర్థించారు.

ఫ్రీటౌన్‌కు సమీపంలో ఉన్న రీజెంట్ ఏరియాలో సోమవారం మట్టిచరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 400 మంది మృతిచెందారు. కనిపించకుండా పోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఇప్పటికే రెడ్‌క్రాస్ పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications