• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్-పెలోసీల మధ్య వార్: స్పీకర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా తిరస్కరించిన ట్రంప్..వీడియో చూడండి..!

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉభయ సభలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించాల్సి ఉంది. సభకు చేరుకున్న ట్రంప్‌ను చూసిన నాన్సీ పెలోసి కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ట్రంప్ మాత్రం తిరస్కరిస్తూ అతని ప్రసంగంకు సంబంధించిన డాక్యుమెంట్లను పెలోసీకి అందజేశారు. ట్రంప్ తన ప్రసంగంకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వగా వాటిలో కొన్నిటిని ఆమె చించివేశారు. ట్రంప్ షేక్‌ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె ఒక్కింత షాక్‌కు గురయ్యారు.

షేక్‌హ్యాండ్ ఇస్తే తిరస్కరించిన ట్రంప్.. స్పీచ్‌ ప్రతులను చించేసిన పెలోసీ

అధ్యక్షుడు ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత స్పీచ్‌కు సంబంధించిన ప్రతులను పెలోసీ చించివేయడంతో వీరిద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తోందనే విషయం అర్థమవుతోంది. ఈ మధ్యనే డొనాల్డ్ ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో నెగ్గారు. ఇక తన ప్రసంగంలో ట్రంప్ అభిశంసన తీర్మానం గురించి ప్రస్తావించలేదు. అయితే తన ప్రసంగం ఆద్యాంతం రిపబ్లికన్లు లేచి నిలబడి చప్పట్లు కొట్టగా.. డెమొక్రాట్లు మాత్రం తమ సీట్లలోనే కూర్చుండిపోయారు. ఇక ట్రంప్‌పై మోపబడ్డ అభియోగాలన్నీ నిరాధారమైనవని చెబుతూ సెనేట్ ఆయన్ను నిర్దోషిగా బుధవారం ప్రకటించే అవకాశం ఉంది.

గౌరవ పదమైన పదాలను వినియోగించని పెలోసీ

ఇక ఎప్పుడైతే ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చారో.. ఇక అప్పటి నుంచి ట్రంప్ ఆమెతో మాట్లాడింది లేదు సరికదా కనీసం చూడను కూడా లేదని వైట్‌హౌజ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దాదాపు నాలుగు నెలల తర్వాత సభలో నాన్సీ పెలోసీ ట్రంప్‌ను చూసి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసే ప్రయత్నం చేయగా ట్రంప్ ఆగ్రహంతో తిరస్కరించి ఆమెకు తన ప్రసంగం ప్రతులను అందజేశారు. ఇక ముందుగా కాంగ్రెస్‌లో అధ్యక్షుడిని పరిచయం చేస్తే గౌరవప్రదమైన పదాలను స్పీకర్ వినియోగిస్తారు. కానీ ఈ సారి మాత్రం పెలోసీ ఆ పదాలను వాడలేదు. "కాంగ్రెస్ ప్రతినిధులు, అమెరికా అధ్యక్షులు" అనే పదాలు మాత్రమే ఆమె వాడారు.

ట్రంప్‌కు మద్దతుగా రిపబ్లికన్ల నినాదాలు

ట్రంప్‌కు మద్దతుగా రిపబ్లికన్ల నినాదాలు

ఇక ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేచి నిలబడగా మరో నాలుగేళ్లు ట్రంప్ అంటూ రిపబ్లికన్ సభ్యులు స్లోగన్లు ఇచ్చారు. ఇక ట్రంప్ ప్రసంగం ప్రారంభించగానే డెమొక్రాట్ సభ్యులు తన ప్రసంగంను వింటూ కూర్చున్నారు. ఇక డెమొక్రాట్లు వైపు నిలిచి వారు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై అనుకూలంగా నిర్ణయం తీసుకున్న స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా ట్రంప్ స్పీచ్ చదువుతున్నప్పుడు అతని వెనకాలే ముభావంగా కూర్చుని కనిపించారు.

 తన విజయాల గురించి చెప్పుకున్న ట్రంప్

తన విజయాల గురించి చెప్పుకున్న ట్రంప్

ఇక ట్రంప్ తన ప్రసంగంలో తాను సాధించిన విజయాల గురించి చెప్పుకున్నారు. మూడేళ్ల క్రితం డెమొక్రటిక్ పార్టీకి చెందిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్... అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అంతేకాదు యువతకు ఉద్యోగాలు కూడా తమ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. మరో 9 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ట్రంప్ మాత్రం తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే అమెరికన్లు తిరిగి ట్రంప్‌ను ఎన్నుకుంటారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడక తప్పదు.

English summary
Ahead of his State of the Union address, US President Donald Trump snubbed the US House of Representative Speaker Nancy Pelosi, who is one of his fiercest critics, and refused to shake hands with the top Democrat. Later she tore apart the copy of his speech that he handed to Pelosi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more