Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచం గొప్ప మార్పును చూడబోతుంది: ట్రంప్‌తో భేటీ అనంతరం కిమ్ జాంగ్ ఉన్

సింగపూర్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అనంతరం ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్న మాట్లాడుతూ.. ప్రపంచం ఇక గొప్ప మార్పును చూడబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గతాన్ని వదిలివేద్దామని చెప్పారు.

కాగా, ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య చారిత్రక సమావేశం సింగపూర్‌లో జరిగింది. సమావేశం అనంతరం ఇరు దేశాధినేతలు పలు కీలక పత్రాలపై సంతకం చేశారు. తొలుత వారిద్దరు భేటీ అయ్యారు. అనంతరం అధికారులతో కలిసి భేటీ, ఒప్పందాలపై సంతకాలు, మీడియా సమావేశం జరిగింది.

Singapore summit: World will see a major change says Kim Jong Un

ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. ఇది ఓ చారిత్రక సమావేశమని, గతాన్ని వదిలిపెట్టాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించామని, ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోందని, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు అన్నారు.

తాము చాలా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేస్తున్నామని, ఉత్తర కొరియాతో ఇప్పుడు మా సంబంధాలు గతంలో కంటే భిన్నంగా ఉండబోతున్నాయని, కిమ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,త ఈ సమావేశంలో పలు అంశాలపై సానుకూలంగా పరిష్కార ఒప్పందాలు చేసుకున్నామని ట్రంప్‌ అన్నారు. కిమ్ చాలా స్మార్ట్, విలువైన వ్యక్తి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+