వింత వ్యాధి: పాము కుబుసంలా ఊడిపోతున్న చిన్నారి చర్మం(వీడియో)

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: వైద్య రంగంలో పెనుసవాళ్లుగా మారిన వింత వ్యాధులను ఇప్పటివరకు అనేకం చూసుంటాం. ఇప్పటికీ సరైన చికిత్స విధానం అందుబాటులో లేని వ్యాధులు చాలానే వ్యాప్తిలో ఉన్నాయి. అమెరికాకు చెందిన ఓ చిన్నారి కూడా ఇలాంటి తరహా వ్యాధితోనే బాధపడుతోంది. అచ్చు పాము తరహాలో ఈ చిన్నారి చర్మం కుబుసం విడవడం డాక్టర్లకే అంతుపట్టడం లేదు.

అమెరికాలోని ఉల్టెవాకు చెందిన ఆరేళ్ల చిన్నారి లామెల్లర్(6) పుట్టిన నాటి నుంచే ఈ వింత వ్యాధితో బాధపడుతోంది. ప్రతీ 15రోజులకు ఒకసారి ఈ చిన్నారి చర్మం కుబుసంలా రాలిపోతుంది. ఆ స్థానంలో మళ్లీ కొత్త చర్మం పుట్టుకొస్తుంది. చిన్నారి పుట్టినప్పటి నుంచి ఇదో నిరంతర ప్రక్రియలా కొనసాగుతూనే ఉంది. చిన్నారికి సోకిన ఈ వ్యాధిని అక్కడి వైద్యులు కచ్చితంగా నిర్దారించలేకపోతున్నారు.

అయితే కుబుసంలా రాలిపోతున్న చర్మం స్థానంలో.. అంతే వేగంగా కొత్త చర్మం పుట్టుకురావడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. ఈ వ్యాధి వల్ల చిన్నారి చర్మంపై ఉన్న స్వేదగ్రంథులు పూర్తిగా మూసిపోయాయి. దీంతో ఆ చిన్నారికి అసలు చెమటే పట్టడం లేదు. దీనివల్ల చిన్నారికి మరిన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటంతో.. ఆమె తల్లిదండ్రులు మేగాన్, టైసన్ లు చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

నిత్యం కూతురి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చిన్నారి చర్మం పొడిబారకుండా లోషన్లు ఉపయోగిస్తున్నారు. ఒకవేళ చిన్నారి చర్మం పొడిబారితే.. చర్మం పగిలిపోయి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తుండటంతో.. చిన్నారి తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Meet the six-year-old girl who sheds her entire skin every day due to a rare condition that makes it grow faster than normal.
Please Wait while comments are loading...