నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: భారత పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ పై దుబాయ్‌ యువరాజు ప్రశంసలు

ప్లైదుబాయ్ విమాన ఘటనలో కో పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా విమానంలోని 174 మందిని కాపాడిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ను దుబాయ్‌ యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ స్వయంగా వెళ్లి పరామర్శించారు.

దుబాయ్‌ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక స్మిత్ నుదిటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టారు. ఇక స్మిత్ ధైర్య సాహసాలను పొగుడుతూ ఆస్పత్రిలో తనను పరామర్శించిన వివరాలను దుబాయ్‌ యువరాజు హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దుబాయ్ పరిపాలన యంత్రాంగం మొత్తం స్మిత్ ను అభినందిస్తుంది.. ప్రశంసలు కురిపిస్తుంది అని పేర్కొన్నారు.

smithmachar pilot Dubai Crown Prince visited Indian pilot following the Flydubai flight incident

ఈ మేరకు భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్య సాహసాలను కొనియాడారు. అతని ధైర్యం, బాధ్యత, మానవులపై ఆప్యాయత మరువలేనిదని ప్రశంసించారు దుబాయ్‌ యువరాజు హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌. అతను తమ టీమ్ లో ఉన్నందుకు తమకు గర్వంగా ఉందని వివరించారు. " ఇతను మా టీమ్ లో భాగస్వామిగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. మన దేశం స్టోరీలో అతను భాగమయ్యాడు. యూఏఈ ఏ నేషన్ ఆఫ్ కంపాషన్.. ఏ నేషన్ ఆఫ్ పీస్.. అండ్ ఏ నేషన్ ఆఫ్ లైఫ్ అని దుబాయ్‌ యువరాజు హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌ పోస్టు చేశారు. దుబాయ్ యువరాజు పోస్టు చేసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరోవైపు భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని యూఏఈలోని భారత కార్యాలయం పేర్కొంది. ప్రస్తుతం స్మిత్‌ ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆయన కుటుంబసభ్యులు, స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఇటీవల ప్రపంచాన్ని షాక్ చేసిన ఫ్లైదుబాయ్​ ఘటనలో ఒమన్​ కు చెందిన కోపైలట్​ హమామ్​ అల్హమామి దాడిలో భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన హమామ్​ అల్హమామిని వీరోచితంగా అడ్డుకుని పోరాడారు. అనంతరం కాక్‌ పిట్‌ తలుపు తెరవడంతో విమానంలోని ప్రయాణికులు లోపలికి వెళ్లి కో పైలట్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ ఘటనలో విమానంలోని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+