స్మగ్లింగ్: దౌత్యవేత్త దేశ బహిష్కరణ
ఢాకా: తమ దేశానికి అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు దౌత్యవేత్తలు కృషి చేస్తుంటారు. అయితే తన స్థాయిని మరిచిపోయి స్మగ్లింగ్ కు పాల్పడిన దౌత్యవేత్తను బంగ్లాదేశ్ నుంచి బహిష్కరించారు.
స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఉత్తర కొరియా దౌత్యవేత్త తాను స్మగ్లింగ్ చెయ్యలేదని సినిమా స్టోరీ చెబుతున్నాడు. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్ కస్టమ్స్ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఢాకాలోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో హన్ సాన్ ఇక్ తొలి కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈయన కంటేనర్ లో రెండు మిలియన్ డాలర్లు (రూ. 10 లక్షలు) విలువైన సిగెరెట్లు బ్లాక్ మార్కెట్ కు తరలించడానికి ప్రయత్నించాడు.

విషయం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు కంటేనర్ ను పరిశీలించారు. అందులో సిగరెట్లతో పాటు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఉత్తర కొరియా రాయబార కార్యాలయం దౌత్యవేత్త హన్ సాన్ ఇక్ ఈ స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనారు. ఉత్తర కొరియా రాయబారి దౌత్య రక్షణను అడ్గు పెట్టుకుని హన్ సాన్ ఇక్ స్మగ్లింగ్ చేస్తున్నాడని అధికారులు గుర్తించారు.
వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ఉత్తర కొరియా అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. హన్ సాన్ ఇక్ ను బంగ్లాదేశ్ నుంచి వచ్చేయాలని ఉత్తర కొరియా ఆదేశించింది.












Click it and Unblock the Notifications