షాక్: 100కిలోల బంగారు నాణెంను దొంగలించారు, విలువెంతో తెలుసా?

Subscribe to Oneindia Telugu

బెర్లిన్‌: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారీ చోరీ జరిగింది. ప్రముఖ బోడే మ్యూజియంలో అత్యంత అరుదైన సుమారు 100కిలోల బరువున్న భారీ బంగారు నాణెం అపహరణకు గురైంది. దీని విలువ సుమారు రూ.6 కోట్ల 49 లక్షల 50 వేలు (పదిలక్షల అమెరికన్‌ డాలర్లు)గా ఉండవచ్చని అంచనా.

కాగా, ఈ 'బిగ్‌ మేపుల్‌ లీఫ్‌' నాణేన్ని 2007లో రాయల్‌ కెనడియన్‌ మింట్‌ తయారుచేసింది. బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌-2 చిత్రాన్ని ముద్రించి ఉన్న ఈ నాణెం సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల ప్రాంతంలో అపహరణకు గురై ఉండవచ్చని జర్మన్‌ పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పక్కనే ఉన్న రైలు పట్టాలపై పడి ఉన్న నిచ్చెన సాయంతోనే దొంగలు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, దొంగతనానికి సంబంధించిన ఓ అనుమానిుతల ఫొటోను కూడా విడుదల చేశారు.

'యునెస్కో' జాబితాలో ఉన్న ఈ మ్యూజియంలో ప్రపంచంలోనే అత్యంత అధిక సంఖ్యలో నాణేల సేకరణ ఉన్నట్లు చెబుతారు. ఇక్కడి అపురూప నాణేల శ్రేణిలో సుమారు 10 లక్షల 2వేల పురాతన గ్రీకు, 50వేల రోమన్‌నాణేలు కూడా ఉన్నాయి. చోరీ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వేగంగా గాలింపు చేపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A giant gold coin bearing the Queen's image, and worth $4m (£3.2m), has been stolen from a museum in Germany.
Please Wait while comments are loading...