దక్షిణాఫ్రికాలో ఇండియా నవదంపతుల మృతి

మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వారిద్దరు ఆదివారం వివాహం చేసుకున్నారు. ఆష్లే రెడ్డి మాస్టర్స్ పూర్తి చేసే వరకు పెళ్లి చేసుకోకుండా ఆగారు. ఆ ప్రాంతంలో విహారానికి వచ్చిన మరో 15 ఏళ్ల బాలుడు ప్రమాదంలో మరణించాడు.
ప్రమాదానికి గురైన వాహనాలు గుర్తించలేనంతగా ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పారామెడిక్స్ దంపతులతో పాటు టీనేజర్ అక్కడికక్కడే మరణించినట్లు ధ్రువీకరించారు. ప్రమాదంతో దక్షిణాఫ్రికాలోని భారతీయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పెళ్లికి వచ్చిన దాదాపు 600 మంది అతిథులు సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. వారు తిరిగి అదే చోటు గుడికూడారు. దంపతులకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications