తెగించిన ఉత్తరకొరియా! మళ్లీ క్షిపణి పరీక్షకు సన్నాహాలు? ట్రంప్ పర్యటనపై కసితోనే?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఉత్తరకొరియా తెగించింది. ఎవరెన్ని చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. అమెరికా అన్నా, దాని అధ్యక్షుడన్నా మండిపడుతోంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినా ఏమాత్రం తగ్గడం లేదు.

పాపం ఉత్తరకొరియా! అమెరికాకు లొంగి బతకాలా, ఆత్మరక్షణ నేరమా, చరిత్ర ఏం చెబుతోంది?

తాజాగా ఉత్తరకొరియా మరోసారి క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్నట్లు దక్షిణ కొరియా అనుమానం వ్యక్తం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దక్షిణ కొరియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.

trump-kim

ట్రంప్ దక్షిణకొరియా పర్యటనను ఆ దేశం జీర్ణించుకోలేకపోతోందని, ట్రంప్ పర్యటన సమయంలోనే మరో క్షిపణి పరీక్ష నిర్వహించి తన సత్తా ఏమిటో చూపాలని భావిస్తోందని, ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అగ్రరాజ్యాల హెచ్చరికల్ని ఏ మాత్రం లెక్కచేయకుడా ఇప్పటికే పలుమార్లు ఉత్తరకొరియా క్షిపణి, అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది. అమెరికా భూభాగాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే జపాన్‌ మీదుగా ఈ మధ్య కాలంలో 5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను పరీక్షించింది.

ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను పరిహసించడానికా అన్నట్లు సరిగ్గా ఆయన దక్షిణ కొరియా పర్యటన సమయంలోనే క్షిపణి పరీక్ష నిర్వహించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు దక్షిణ కొరియా నిఘా విభాగం ఒక నివేదిక ఇచ్చినట్టు ఓ వార్తా సంస్థ ప్రకటించింది.

తాను దక్షిణ కొరియాను సందర్శంచిన సమయంలో నిజంగానే ఉత్తరకొరియా గనుక క్షిపణి పరీక్ష జరిపితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదలరు. కచ్చితంగా ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పి తీరుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea may be planning a new missile test, South Korea's spy agency told lawmakers on Thursday, after brisk activity was spotted at its research facilities, just days before U.S. President Donald Trump visits Seoul. Reclusive North Korea has carried out a series of nuclear and missile tests in defiance of U.N. Security Council resolutions, but has not launched any missiles since firing one over Japan on Sept. 15, the longest such lull this year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి