అమెరికాలో విస్తరిస్తున్న కార్ఛిచ్చు: సురక్షిత ప్రాంతాలకు జనం
వాషింగ్టన్: దక్షిణ కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మంది సొంత ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
శాంటాపౌలాలోని అటవీ ప్రాంతంలో సోమవారం మంటలు చెలరేగాయి. గంటకు 65 నుంచి 90 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు ఇందుకు తోడవగా కార్చిచ్చు కొద్దిగంటల్లోనే 25 చదరపు కి.మీ అటవీని దహించివేయడం గమనార్హం.

అగ్నిమాపక సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నా.. మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో ఈ మంటలు.. లక్షకుపైగా జనాభా ఉన్న శాంటాపౌలా నగరానికి ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో వేలమంది ఇతర ప్రదేశాలకు తరలివెళ్లారు. మిగిలిన వారు అరచేతిలో ప్రాణాలు పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications