వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Southern Ocean: మహా సముద్రాలు 4కాదు, ఐదవది ఇదే: National Geography సంచలన ప్రకటన

|
Google Oneindia TeluguNews

భూగోళంపై 71శాతం నీరు, 29శాతం భూభాగం కలదు.. భూమిపై మొత్తం ఏడు ఖండాలుండగా, నాలుగు మహాసముద్రాలున్నాయి.. అవి ఆర్కిటిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం.. అంటూ చిన్నప్పటి నుంచీ చదివింది ఇప్పుడు కాస్త మారింది. మారడమంటే మరేంటో కాదు, మహాసముద్రాలు నాలుగు కాస్తా ఐదుగా గుర్తింపు పొందాయి..

కరోనా చికిత్సలో కీలక మలుపు? -Monoclonal antibody therapyతో గంటల్లోనే సత్పలితాలుకరోనా చికిత్సలో కీలక మలుపు? -Monoclonal antibody therapyతో గంటల్లోనే సత్పలితాలు

నాలుగు మహా సముద్రాలు ఉన్నాయని ఇప్పటి వరకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం అట్లాస్ ను మార్చుకోక తప్పదు. ఎందుకంటే మరొక మహా సముద్రం ఉందని నేషనల్ జాగ్రపీ కార్టోగ్రాఫర్స్ ప్రకటించారు. భూ మండలం మీద ఐదో మహా సముద్రం సదరన్ ఓషన్ అని గుర్తించినట్లు తెలిపారు.

Southern Ocean recognised as worlds fifth ocean by Nat Geo cartographers

దక్షిణ మహా సముద్రం (సదరన్ ఓషన్)ను ప్రపంచంలో ఐదో మహా సముద్రంగా గుర్తించినట్లు నేషనల్ జాగ్రఫీ సొసైటీ ప్రకటించింది. జూన్ 8న ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ గుర్తింపును వెల్లడించింది. ఇక్కడి నీరు చాలా చల్లగా ఉంటుందని, తక్కువ ఉప్పదనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్

నేషనల్ జాగ్రఫీ సొసైటీ 1915 నుంచి మ్యాప్‌లను తయారు చేస్తోంది. ఇప్పటి వరకు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్ మహా సముద్రాలను గుర్తించింది. కొత్తగా సదరన్ ఓషన్‌ను ఐదో మహా సముద్రంగా ప్రకటించింది. అమెరికాకు చెందిన జాగ్రఫిక్ నేమ్స్ బోర్డు కూడా సదరన్ ఓషన్‌ను గుర్తించింది. అంటార్కిటికా తీరం నుంచి 60 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ వరకు ఈ మహా సముద్రం వ్యాపించి ఉన్నట్లు తెలిపింది.

Southern Ocean recognised as worlds fifth ocean by Nat Geo cartographers

నిజానికి దక్షిణ మహా సముద్రం (సదరన్ ఓషన్) సరిహద్దులను 2000వ సంవత్సరంలో ప్రతిపాదించారు. కానీ అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందడం సాధ్యం కాలేదు.

English summary
arth comprises 71 per cent of water and those familiar with geography know that there are four oceans surrounding the landmass. Four? No, now there are five oceans. The National Geography cartographers have now identified the Southern Ocean as the fifth ocean on the planet. The development comes on the occasion of World Oceans Day which was marked on June 8. The new ocean has been identified by the National Geography Society which has been making maps since 1915 and had so far recognised the Atlantic, Pacific, Indian, and Arctic oceans. The Southern Ocean has also been recognised by the US Board on Geographic Names as the body of water extending from the coast of Antarctica to the line of latitude at 60 degrees South.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X