1657లో తయారు చేసిన సాస్‌తో ట్రంప్‌కు విందు భోజనం

Posted By:
Subscribe to Oneindia Telugu

సియోల్: దక్షిణ కొరియా పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశం మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేయనుంది. ట్రంప్ పర్యటన కోసం ఆ దేశం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్‌లోని ద బ్లూ హౌస్ బాంకెట్ హాల్‌లో ట్రంప్ ఇవాళ విందు భోజ‌నం ఆర‌గించ‌నున్నారు. అందుకోసం ప్ర‌త్యేక వంట‌కాల‌ను సిద్ధం చేయించిన‌ట్లు ఆ దేశ అధ్య‌క్ష భ‌వ‌నం ప్ర‌క‌టించింది. ట్రంప్ కోసం 360 ఏళ్ల నాటి సోయా సాస్‌ను విందులో వ‌డ్డించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ సాస్ 1657 స‌మ‌యంలో త‌యారు చేశారు.

Soy sauce older than US on Trump's South Korea menu

ద‌క్షిణ కొరియ‌న్ల‌కు ఆహారంలో సోయా సాస్ చాలా ప్ర‌త్యేకం. ఇది ఎంత ఎక్కువ కాలం పులిస్తే అంత రుచిగా ఉంటుంది. అందుకే దాని త‌యారీ కాలాన్ని బ‌ట్టి ధ‌ర నిర్ణయిస్తారు. గతంలో ఓ వంట‌ల ఫెస్టివ‌ల్‌లో 450 ఏళ్ల క్రితం నాటి సోయా సాస్‌ 100 మిలియ‌న్ వాన్ల‌కు (90వేల డాల‌ర్లు) అమ్ముడుపోయిందంటే దాని విలువ అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ సాస్‌తో పాటు ట్రంప్‌కి ఇష్ట‌మైన సోలె చేప, అలాగే ద‌క్షిణ కొరియా, జ‌పాన్ మ‌ధ్య వివాదాస్పదంగా ఉన్న డోక్డో దీవి నుంచి తీసుకువ‌చ్చిన రొయ్య‌లను వ‌డ్డించ‌నున్నారు. ద‌క్షిణ కొరియా సంప్ర‌దాయ ఆహారాల‌ను ప్ర‌తిబింబించేలా రుచిక‌ర ఆహారాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు అధ్య‌క్ష భ‌వ‌నం ప్ర‌తినిధులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A special sauce more than a century older than the United States will be on the menu for Donald Trump at his state banquet in Seoul on Tuesday (Nov 7) - along with a diplomatically tricky prawn.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి