వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Inspiration4: అంతరిక్షంలోకి నలుగురు సామాన్యులు: మూడు రోజులపాటు అన్నీ అక్కడే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనలను సాగించే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ స్పేస్ ఎక్స్.. ఊహించని ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తోన్న కంపెనీ అది. అపర కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తరువాత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు ఎలాన్ మస్క్. ఆయనకు చెందిన ఈ స్పేస్ ఎక్స్ అరుదైన ఘనతను సాధించింది.

Time Magazine: ప్రధాని మోడీ, మమత బెనర్జీ సరసన తాలిబన్ లీడర్ ముల్లా బరాదర్Time Magazine: ప్రధాని మోడీ, మమత బెనర్జీ సరసన తాలిబన్ లీడర్ ముల్లా బరాదర్

అంతరిక్షంలోకి నలుగురు

అంతరిక్షంలోకి నలుగురు సామాన్యులను పంపించింది. అంతరిక్ష పరిశోధనలతో వారికి ఎలాంటి సంబంధం లేదు. దానిపై వారికి ఎలాంటి అవగాహన కూడా లేదు. వారంతా నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్. అలాంటి నలుగురిని ఎంపిక చేసి, అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించింది. ఫాల్కన్ 9 రాకెట్ వారిని మోసుకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా మెరిట్ ఐలండ్స్‌లో గల జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ అండ్ లాంచ్ ఆపరేషన్స్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను లాంచ్ చేసింది స్పేస్ ఎక్స్. ఈ ప్రాజెక్ట్‌కు ఇన్‌‌స్పిరేషన్ 4 అని పేరు పెట్టింది.

నాసా లాంచింగ్ స్టేషన్ నుంచి..

అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. నాసాకు చెందిన లాంచ్ ఆపరేషన్స్ సెంటర్ ఇది. ఈ ప్రాజెక్టు విజయవంతంమైనట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ఈ రాకెట్ నిర్దేశిత మార్గంలోనే ప్రయాణించిందని, నలుగురు నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపింది. వారంతా మూడు రోజుల పాటు అంతరిక్షంలోనే గడుపుతారని పేర్కొంది. అంతరిక్ష పరిశోధనలతో సంబంధం లేని నాన్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ వ్యక్తులను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

ఆ నలుగురూ వీరే..

ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వారిని అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో జేర్డ్ ఇసాక్‌మన్, పైలెట్ సియాన్ ప్రొక్టార్, మెడికల్ ఆఫీసర్ హేలీ ఆర్సెనియాక్స్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్ సెంబ్రోస్కి ఉన్నారు. జేర్డ్ ఇసాక్‌మన్ ఈ రాకెట్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. భూ ఉపరితలం నుంచి 585 కిలోమీటర్ల ఎత్తున సర్కులర్ ఆర్బిట్‌లోకి డ్రాగన్ ఫాల్కన్ 9 రాకెట్ రెండో దశ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి అయిన ఖర్చును ఇసాక్‌మన్ భరించారు. అది ఎంత అనేది తెలియరావట్లేదు. దాన్ని వెల్లడించడానికి అటు ఇసాక్‌మన్ గానీ, స్పేస్ ఎక్స్ కంపెనీ మేనేజ్‌మెంట్ గానీ ఇష్టపడట్లేదు.

చిన్నపిల్లల ఆసుపత్రికి విరాళాల కోసం..

ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం- సెయింట్ జ్యూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వడానికి కనీసం 200 మిలియన్ డాలర్లను సేకరించడమే. దీనిద్వారా వచ్చిన ప్రతి డాలర్‌ను కూడా ఈ చిన్నపిల్లల ఆసుపత్రికి విరాళంగా ఇస్తుంది స్పెస్ ఎక్స్ కంపెనీ మేనేజ్‌మెంట్. అమెరికా టెన్నెస్సేలోని మెంఫిస్ సిటీలో ఉంటుందీ ఆసుపత్రి. దీనికి విరాళంగా ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్‌ను స్పేస్ ఎక్స్ టేకప్ చేసింది. ఆరునెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేసింది.

Recommended Video

YS Sharmila Condolence Saidabad Incident Victim Family || Oneindia Telugu

ఎలాన్ మస్క్ సాధించిందేమిటీ

ఈ ప్రాజెక్టు ద్వారా ఎలాన్ మస్క్ కొన్ని అరుదైన రికార్డులను నెలకొల్పారు. అంతరిక్షానికి నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్‌ను తొలిసారిగా విజయవంతంగా పంపించిన రికార్డును నెలకొల్పారు. నల్లజాతీయురాలైన ఓ మహిళను ఈ స్పేస్ క్రాఫ్ట్ పైలెట్‌గా నియమించడం ఇదే ఫస్ట్‌టైమ్. అలాగే- స్పేస్‌లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ వయస్సు ఉన్న అమెరికా పౌరులుగా గుర్తింపు పొందారు. అంతరిక్ష పరిశోధనలతో సంబంధం లేని వారిని కూడా స్పేస్‌కు పంపించవచ్చిన ఎలాన్ మస్క్ నిరూపించినట్టయింది.

English summary
Private space research company SpaceX, headed by Elan Musk, launches Inspiration4 rocket carrying four crew members, all civilians, into Earth orbit from NASA's Kennedy Space Center in Florida in United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X