శ్రీలంక ప్రధాని తర్వాత మంత్రి.. 13న అధ్యక్షుడు రాజీనామా, ప్రధాని ఇంటికి నిప్పు
శ్రీలంకలో పరిస్థితి క్షణ క్షణాన దిగజారుతుంది. ఇప్పటికే ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేశారు. ఆ వెంటనే మంత్రి బందుల గుణవర్దన రిజైన్ చేశారు. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది జర్నలిస్టులపై దాడి చేశారు. ఘటనను అంతా ఖండించారు. మరోవైపు పార్టీ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్పీకర్ అధ్యక్షుడు రాజపక్సేకు తెలియజేశారు.
దీంతో అధ్యక్షుడు కూడా 13వ తేదీన రాజీనామా చేస్తారని తెలిసింది. ప్రధాని ఇంటి వద్దకు వచ్చిన ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘటనను జప్పా ఎంపీ ఎంఏ సుమంతిరన్ ఖండించారు. మరోవైపు విక్రమసింఘే ప్రైవెట్ హౌస్‌ను దుండగులు నిప్పు అంటించారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పీక్‌క్ చేరింది. ద్రవ్యోల్బణం వల్ల కూడా ఆ దేశంలో ప్రజలు ఆందోళనకు దిగారు. పెట్రో, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు అధ్యక్షుడు ఇంటిలోకి వెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు హోరెత్తుతున్న వేళ ప్రధాని విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విక్రమసింఘే తన నిర్ణయాన్ని తెలియజేశారు. శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. విక్రమసింఘే పదవీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు రాజపక్సే కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి.












Click it and Unblock the Notifications