శ్రీలంక మహిళ గోల్డ్ స్మగ్లింగ్: చెన్నైలో పట్టివేత
చెన్నై: గుట్టు చప్పుడు కాకుండ బంగారం స్మగ్లింగ్ చెయ్యడానికి ప్రయత్నించిన విదేశీ మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బంగారు నగలు ఎక్కడికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.
మంగళవారం అర్దరాత్రి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ప్రయాణికుల లగేజ్ పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో శ్రీలంకకు చెందిన జువైరియా (33) అనే మహిళ బ్యాగ్ లు పరిశీలించారు. బ్యాగ్ లోని దుస్తులను క్షుణ్ణంగా పరిశీలించడంతో బంగారం బయటపడింది.

అందులో రూ. 55 లక్షల విలువైన రెండు కేజీల బంగారు నగలు బయటపడటంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆమెను విచారణ చెయ్యగా పొంతన లేని సమాధానాలు చెబుతోందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
దుబాయ్ నుండి చెన్నై వచ్చిన విమానంలో జువైరియా ప్రయాణించిందని పోలీసులు అన్నారు. బంగారు నగలకు సంబంధించి ఆమె దగ్గర ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవని పోలీసులు చెప్పారు. జువైరియా నగలు స్మగ్లింగ్ చెయ్యడానికి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications