వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sri Lanka Crisis: సంక్షోభ లంకలో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే-స్పీకర్ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో ఆర్దిక సంక్షోభంతో మొదలై రాజకీయ సంక్షోభంగా మారిన పరిస్దితులు ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధ్యక్షుడు, ప్రధాని సహా రాజపక్సల కుటుంబంలో ఏ ఒక్కరూ ఏ వదవిలోనూ ఉండేదుకు అవకాశం లేకుండా ప్రజలు తమ నిరసనసలు తెలుపుతున్నారు. దీంతో రాజపక్సలు ఇప్పటికే దేశం విడిచి పారిపోయారు. దీంతో వీరి స్ధానంలో ముందుగా ప్రధానిగా ఎంపికైన రణిల్ విక్రమసింఘే ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు.

ఇవాళ ప్రధాని నివాసంలోకి కూడా నిరసనకారులు దూసుకెళ్లారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. చివరికి ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. అయితే నిరసనకారులు ఇంకా శాంతించడం లేదు. దీంతో పార్లమెంటు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని రణిల్ విక్రమసింఘేను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ మహీంద అబేవర్షన నిర్ణయం తీసుకున్నారు. దీంతో విక్రమసింఘే ఇప్పుడు అదనపు బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 37(1) ప్రకారం స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Sri Lankan PM Ranil Wickremesinghe appointed as acting Prez amid massive protests

వాస్తవానికి రాజపక్సలందరూ రాజీనామాలు చేసేసినా అధ్యక్షుడు గోటబాట మాత్రం రాజీనామాకు ససేమిరా అన్నారు. కొంతకాలం అధ్యక్షుడిగా ఉన్న ఆయనపైనా నిరసనకారులు ఆగ్రహం ప్రదర్శించారు. దీంతో అధ్యక్ష నివాసం సైతం నిరసనలకు కేంద్రంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆయన దేశం విడిచి పారిపోయారు. తొలుత తననుు దేశం దాటేందుకు వీలు కల్పిస్తే రాజీనామా చేస్తానని చెప్పిన గోటబాయ.. అనంతరం ప్రభుత్వ విమానం ఎక్కి పరారయ్యారు. మాల్దీవులకు ఆయన వెళ్లినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఆయన స్ధానంలో రణిల్ విక్రమసింఘే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నారు.

English summary
prime minister ranil wikreme singhe has been as acting president of sri lanka today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X