ప్రైవేట్ జెట్ లో సింగపూర్‌కు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స.. మాల్దీవ్స్ విమానాశ్రయంలో భారీ భద్రత!!
శ్రీలంకను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన రాజపక్స రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా చెయ్యకుండా మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స సింగపూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో మాల్దీవుల విమానాశ్రయంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స మాల్దీవుల నుంచి సింగపూర్‌కు బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో మాల్దీవుల్లోని వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం. శ్రీలంక యొక్క అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా పౌరుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తిన తర్వాత, తన రాజీనామాకు ముందస్తు సూచనగా, అధ్యక్షుడు రాజపక్స బుధవారం తన దేశం నుండి మాల్దీవులకు పారిపోయారు.

పౌరుల నుంచి ఎదురుదెబ్బ తగులుతుందనే భయంతో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తాను సింగపూర్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ జెట్‌ను ఏర్పాటు చేయాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు మాల్దీవుల్లోని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజపక్స తన రాజీనామాను ఇవ్వకుండానే మాల్దీవులకు పారిపోయారు. నివేదికల ప్రకారం, వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క వీఐపీ టెర్మినల్ దగ్గర వేచి ఉన్న జర్నలిస్టులను భద్రతా అధికారులు అక్కడ నుండి పంపివేశారు. గొటబయ రాజపక్స శ్రీలంక నుండి పారిపోయిన తర్వాత శ్రీలంక అంతటా బుధవారం అత్యవసర పరిస్థితి విధించబడింది.
శ్రీలంకలో అధ్యక్షుడు గోటబాట రాజపక్సకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు మాల్దీవులలోనూ కొనసాగుతున్నాయి. మాల్దీవులకు పారిపోయిన రాజపక్సను వెతుక్కుంటూ మాల్దీవులకు వెళ్లి మరీ నిరసనకారులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని విక్రమసింఘే నివాసాన్ని సైతం చుట్టుముట్టి ఆందోళనలు చేపడుతుండటంతో ఎమర్జెన్సీ విధించారు. ఇదిలా ఉంటే శ్రీలంక రాజకీయ నేతలు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అక్కడ తాత్కాలిక అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్‌ను స్వీకరించాలని నిర్ణయించారు.
అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం కోరింది. ప్రభుత్వం మరియు ప్రతిపక్షం రెండింటికీ ఆమోదయోగ్యమైన ప్రధానిని నామినేట్ చేయాలని ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పీకర్ మహింద యాపా అబేవర్ధనాకు కూడా తెలియజేశారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స మాల్దీవులకు వెళ్లడం పారిపోవడంతో కొలంబోలో మళ్లీ పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. దీంతో శ్రీలంక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పెరుగుతున్న నిరసనలను అదుపు చేసేందుకు కొలంబోతో సహా పశ్చిమ ప్రావిన్స్ అంతటా నిరవధిక కర్ఫ్యూ విధించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications