వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరసనలపై శ్రీలంక అధ్యక్షుడి ఉక్కుపాదం - తగ్గేది లేదంటూ..!!

|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో నూతన అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘే కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. నిసనకారులను నియంత్రించే చర్యలను మొదలు పెట్టారు. ఆర్దిక -రాజకీయ సంక్షోభం కొంత కాలంగా శ్రీలంక లో ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులు అధ్యక్ష భవనం లోకి ప్రవేశించారు. కొలంబలోనే ప్రధానంగా నిరసనల కారులు పెద్ద సంఖ్యల చేరి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రణీల్‌ విక్రమ సింఘే ఆదేశాలతో నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి.

భద్రతా బలగాల దాడులు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోనే ప్రధాన క్యాంప్‌పై గురువారం అర్ధరాత్రి వందల మంది ఆ దేశ భద్రతా బలగాలు, పోలీసులు దాడులు చేపట్టారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు. కొద్ది రోజుల క్రితం అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. అధ్యక్షుడి సచివాలయ భవనం ముందు బారికేడ్లను ఏర్పాటు చేసారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడి ఆదేశాలతో వాటిని భద్రతా దళాలు తొలిగించే పని ప్రారంభించారు.

మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

ఈ సమయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, నిరసన కారులు మాత్రం తాము వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘే రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. 'ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే మాకు విజయం సాధ్యమవుతుందంటూ నినదిస్తున్నారు. ఏప్రిల్‌ 9 నుంచి అధ్యక్షుడి కార్యాలయం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన నిరసనకారుల పైన ఇప్పుడు భద్రతా దళాలు మెరుపు దాడులు ప్రారంభించారు. సముద్రతీర కార్యాలయాన్ని సైనికులు చుట్టుముట్టారు.

కొత్త అధ్యక్షుడి నిర్ణయంతో

కొత్త అధ్యక్షుడి నిర్ణయంతో

ఏప్రిల్‌ నుంచి వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు అవసరమైన సామగ్రిని అందించడానికి ఏర్పాటు చేసిన అనేక తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. రణీల్‌ విక్రమసింఘే తమను నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నారని..మళ్లీ అదే తప్పు చేస్తున్నారని నిరసనకారులు చెప్పుకొచ్చారు. కానీ తాము వెనక్కు తగ్గమని చెబుతున్నారు. నీచ రాజకీయాల నుంచి దేశాన్ని విడిపించటమే తమ లక్ష్యమంటూ నిరసన కారులు తేల్చి చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు శ్రీలంకలో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
Srilanka Security personnel armed with batons began removing barricades set up by protesters blocking the main gate of the Presidential Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X