మా భూభాగంలోకి వచ్చినట్లు అంగీకారం: భారత్‌కు చైనా షాక్, యుద్ధమే జరిగితే.. అమెరికా అధికారి
భారత్‌పై చైనా మరోసారి నోరు పారేసుకుంది. ఈసారి ఏకంగా భారత్ అనని మాటలనే అన్నట్లుగా చెప్పి షాకిచ్చింది. తద్వారా కయ్యానికి కాలు దువ్వుతోంది.
బీజింగ్: భారత్‌పై చైనా మరోసారి నోరు పారేసుకుంది. ఈసారి ఏకంగా భారత్ అనని మాటలనే అన్నట్లుగా చెప్పి షాకిచ్చింది. తద్వారా కయ్యానికి కాలు దువ్వుతోంది.
చదవండి: మతిమరుపు భారత్‌కు మళ్లీ గుణపాఠం చెప్పాలి: చైనా తీవ్రవ్యాఖ్యలు

చైనా రాలేదని భారత్ అధికారులు చెప్పారని మంత్రి
చైనా భూభాగంలోకి భారత్ సైన్యాలు వచ్చినట్లు ఆ దేశ అధికారులే అంగీకరించారని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ వి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడే తప్పొప్పులు ఏమిటనేవి క్షుణ్ణంగా తెలుస్తున్నాయని, చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని ఆ దేశానికి చెందిన సీనియర్ అధికారులు బహిరంగంగానే చెబుతున్నారని వాంగ్ అన్నారు.
Recommended Video


చైనా భూభాగంలోకి భారత్ వచ్చిందంటూ
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లోను ఈ వ్యాఖ్యలను పెట్టింది. చైనా భూభాగంలోకి భారత్ వచ్చిందని ఆ దేశం ఒప్పుకుందని, ఈ సమస్యకు ఒకటే పరిష్కారమని, భారత్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని చైనా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

దృఢంగా అమెరికా - భారత్ మధ్య బంధం
చైనాతో నెలకొన్న వివాదాన్ని భారత్ పరిష్కరించుకోగలదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో పెంటగాన్‌లో పని చేసిన కీలక అధికారి ఒకరు తెలిపారు. అమెరికా, భారత్ మధ్య బంధం చాలా దృఢంగా ఉందన్నారు. దానికి నిదర్శనం భారత ప్రధాని మోడీని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆహ్వానించిన విధానమన్నారు.

భారత్‌కు సాయం అవసరం లేదు.. చైనా రెచ్చగొట్టే ప్రయత్నం
భారత్‌కు ఎవరి సాయమూ అవసరమవుతుందని తాను భావించడం లేదని సదరు అమెరికా అధికారి చెప్పారు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు తీసిపోని విధంగా భారత్ వృద్ధి సాధిస్తోందన్నారు. టెక్నాలజీ పరంగా భారత్ సాధిస్తున్న విజయాలు చైనా కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయని, అందుకే భారత్‌ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు.

యుద్ధం జరిగితే భారత్ పక్షాన అమెరికా
భారత్ ఏ విషయంలోనూ చైనాకు తీసిపోదని సదరు అధికారి తెలిపారు. దక్షిణాసియాలో చైనాతో తలపడి ఎదుర్కోగల శక్తి ఒక్క భారత్‌కు మాత్రమే ఉందన్నారు. భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం అనివార్యమైన పక్షంలో అమెరికా.. భారత్ పక్షాన నిలబడుతుందన్నారు. అయితే భారత్‌కు ఒకరి సాయం అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

చైనా అండతో పాకిస్తాన్ కూడా
ఒకవైపు భారత్‌ను చైనా ఇబ్బంది పెడుతుండగా పాకిస్తాన్ కూడా చైనా సరసన చేరి భారత్‌ను దెబ్బతీసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోందని సదరు అధికారి తెలిపారు. అయితే పాక్ కల ఫలించే అవకాశం లేదన్నారు.

చైనాకు ధీటుగా భారత్
ఇదిలా ఉండగా, డొక్లాం సరిహద్దు వద్ద భారత్-చైనా బలగాలు గత నెల రోజులుగా ఉంటున్నాయి. దాదాపు 350 మంది భారత బలగాలు మానవహారం రూపంలో చైనా దళాలకు ఎదురుగా నిలబడ్డారు. నెల రోజులు నుంచి డొక్లాం వివాదంపై ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. భారత్ దళాలు వెనక్కి తగ్గాలని చైనా పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications