అమెరికాలో ఆవిర్భవించిన కొత్త సిటీ: మస్క్‌కు గిఫ్ట్
Starbase: అమెరికాలో మరో కొత్త నగరం ఆవిర్భవించింది. దీని పేరు స్టార్‌బేస్. టెక్సాస్‌లో అంతర్భాగంగా ఉంటూ వచ్చిన ఈ ప్రాంతం పరిధి మొత్తాన్నీ సిటీగా ప్రకటించింది ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.
టెక్సాస్ బొకా చికా విలేజ్‌లో ఉంటుంది..స్టార్‌బేస్. ఇది- అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు అధినేతగా వ్యవహరిస్తోన్న ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందినది. ఆ సంస్థకు చెందిన రాకెట్ లాంచింగ్ ప్యాడ్ ఉండేదిక్కడే. స్టార్‌షిప్, డ్రాగన్ క్యాప్సుల్స్ వంటి స్పేస్ క్రాఫ్ట్స్, రాకెట్లను ఇక్కడి నుంచే అంతరిక్షంలోకి పంపిస్తుంటుంది.

అంతరిక్షానికి సంబంధించిన ఇతర పరిశోధనలను చేపడుతూ ఉంటుంది స్పేస్ ఎక్స్. ఈ సంస్థ ఉద్యోగులందరూ దాదాపుగా ఇక్కడే నివసిస్తుంటారు. ఫలితంగా- ఓ మినీ టౌన్‌షిప్ ఏర్పడింది. ఈ సంస్థ ఉద్యోగుల కోసం అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి.
బొకా చికా విలేజ్, స్టార్ బేస్ ఉన్న ప్రాంతం, స్పేస్ ఎక్స్ ఉద్యోగులు నివసిస్తోన్న ప్రాంతం మొత్తానికి కూడా సిటీ హోదా ఇవ్వడానికి సహకరించాలంటూ గత ఏడాది స్పేస్ఎక్స్ జనరల్ మేనేజర్ క్యాథరిన్ లారెడర్ స్థానికులకు లేఖ రాశారు. ఇప్పుడు తాజాగా ఓటింగ్ నిర్వహించారు.
కామెరాన్ కౌంటీ ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ ఈ ఎన్నికలను జరిపింది. ఈ ఓటింగ్‌లో భారీ మెజారిటీ ఇవ్వడం ద్వారా తమ అంగీకారాన్ని తెలియజేశారు స్థానికులు. మొత్తం 218 మంది ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టార్‌బేస్‌కు సిటీ హోదా ఇవ్వడానికి అనుకూలంగా 212 మంది ఓటు వేశారు. ప్రతికూలంగా ఆరు ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.
ఫలితంగా- ఈ ప్రాంతం మొత్తం కూడా కొత్త నగరంగా ఆవిర్భవించింది. టెక్సాస్ స్టేట్‌లో మెక్సికోతో సరిహద్దులు పంచుకుంటోన్న దక్షిణ ప్రాంతంలో 3.9 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించివున్న స్టార్ బేస్.. ఇప్పుడు సిటీ హోదా పొందింది. సిటీ హోదా రావడం వల్ల స్పేస్ ఎక్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ బాబీ పెడెన్.. మేయర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
Starbase, Texas
— Elon Musk (@elonmusk) May 4, 2025
Is now a real city!












Click it and Unblock the Notifications