రూ.కోటిన్నర వజ్రాన్ని మింగేసింది, ఆపరేషన్ చేశారు
బీజింగ్: చైనాకు చెందిన ఓ మహిళ రూ.కోటిన్నర విలువ గల వజ్రాన్ని మింగింది. దానిని గుర్తించిన అధికారులు రికవరీ చేసుకున్నారు. ఈ సంఘటన థాయ్‌లాండులో జరిగింది.
బ్యాంకాక్‌లో పెద్ద వజ్రాలు, నగల దుకాణానికి వెళ్లిన ఓ చైనా మహిళ నగలను, వజ్రాలను చూసింది. అనంతరం ఓ ప్రాంతంలో కోటిన్నర రూపాయల విలువ చేసే వజ్రాన్ని ఒకదాన్ని ఎంపిక చేసుకుని ఎవరూ చూడకుండా మింగేసింది.

తాను వాటిని మింగిన విషయాన్ని ఎవరూ చూడలేదని ఆమె భావించింది. కానీ అక్కడే ఉన్న సిసి కెమెరాల్లో అది రికార్డయింది. దానిని గుర్తించారు. వెంటనే వైద్యులను పిలిపించి.. ఆ వజ్రం ఎక్కడ ఉందో స్కానింగ్ ద్వారా పరిశీలించారు.
ఆమె పేగుల్లో ఇరుక్కుపోయి ఉంది. వైద్యుడు ఆమెను బతికించడం కోసం కష్టపడి ఆపరేషన్ చేసి ఆరు కేరట్ల వజ్రాన్ని బయటకు తీశాడు. దొంగతనం చేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications