కాబోయే బ్రిటన్ ప్రధానిని నేను కాదు: హాట్ మోడల్

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా... ప్రస్తుతం హోంమంత్రి థెరిసా మే బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాని డేవిడ్ కామెరూన్ మంత్రివర్గంలో మహిళా మంత్రిగా ఉన్న థెరిసాకు మరో మహిళా మంత్రి ఆండ్రియా లీడ్సమ్ నుంచి ప్రధాన పోటీ ఉండగా, తాను పోటీలో లేనని ఆమె సోమవారం ప్రకటించారు. తదుపరి ప్రధాని థెరిసా మే కానున్నారు.

బ్రెగ్జిట్-వాళ్లే ఓటు వేసి ఉంటే..: విడిపోయేందుకు రెండేళ్లు, ఏ రంగాలపై ప్రభావం?

డేవిడ్ కామెరూన్ బుధవారం నాడు ప్రధానిగా రాజీనామా చేయనన్నారు. ఆయన స్థానంలో బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

Stop congratulating this hot woman. She is not UK's next prime minister

ఇదిలా ఉండగా, బ్రిటన్ తదుపరి ప్రధాని థెరిసా మే అనే వార్తల నేపథ్యంలో ఆమె పేరుతో ఉన్న హాట్ గ్లామర్ మోడల్ (మోడల్ రిసా మే)కు పెద్ద ఎత్తున అభినందనలు అందుతున్నాయి. దీని పైన సదరు హాట్ మోడల్ స్పందించారు.

బ్రెగ్జిట్ ఎఫెక్ట్: రూ.200వందల కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడు

తన ట్విట్టర్ ఖాతాలో అభినందనలు వెల్లువెత్తుతుండటంపై థెరిసా మే ఆశ్చర్యపోతున్నారు. సమాధానం కూడా ఇచ్చింది. తదుపరి ప్రధానిని నేను కాదని, మరో థెరిసా అని ఆమె వివరణ ఇచ్చుకున్నారు.

'మీరు నన్ను ఎవరనుకుంటున్నారు? నేను యూకే గ్లామర్ మోడల్‌ని. కాబోయే ప్రధానిని కాదు. చాలామంది ఎందుకు పొరబడుతున్నారో.. మీరు భావిస్తున్న వ్యక్తిని నేను కాదు. దయచేసి అభినందనలు ఆపండి' అని ట్వీట్ చేసింది. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ నేపథ్యంలో డేవిడ్ కామెరూన్ రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Stop congratulating this hot woman. She is not UK's next prime minister.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి