హార్మూజ్ జలసంధి క్లోజ్.. ఆ ఒక్క దేశానికి తప్ప..!
ఇరాన్.. కీలకమైన హార్ముజ్ జలసంధిని చైనా నౌకలకు మాత్రమే అనుమతించింది. ఇతర దేశాల ఓడలు అనుమతి లేకుండా ప్రవేశిస్తే సైనిక చర్యలు తప్పవని కఠినంగా హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ఐదో రోజుకు చేరుకోగా ఈ పరిణామం చోటుచేసుకుంది. తాజా నివేదిక ప్రకారం.. ఇరాన్ కు బీజింగ్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృతజ్ఞతగా హార్ముజ్ జలసంధి ద్వారా చైనా నౌకలకు మాత్రమే ప్రవేశం కల్పించినట్లు ఇరాన్ ప్రకటించింది. మిగిలిన అన్ని నౌకలకు ప్రవేశం నిషేధం అని తేల్చి చెప్పింది. అనుమతి లేని ప్రవేశాలపై సైనిక చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
ఇరాన్ హెచ్చరికలను లెక్కచేయకుండా వెళ్లిన పదికి పైగా చమురు ట్యాంకర్లు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక చర్యల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా నౌకాదళం వెంటనే ట్యాంకర్లకు హార్ముజ్ జలసంధి గుండా రక్షణగా వెళ్తుందని తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో.. "ఏం జరిగినా సరే, ప్రపంచానికి ఇంధన సరఫరా నిరాటంకంగా సాగేలా అమెరికా చూస్తుంది. అమెరికా ఆర్థిక, సైనిక బలం ప్రపంచంలోనే అత్యంత గొప్పది. మరిన్ని చర్యలు త్వరలో రానున్నాయి" అని పేర్కొన్నారు.
ఇరాన్ లో విస్తరిస్తున్న యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ఇంధన సరఫరాలో ఈ ఇరుకైన జలసంధి కీలక పాత్రను ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ యొక్క ఇరుకైన ముఖ ద్వారం. ప్రపంచ చమురులో ఐదవ వంతు దీని గుండా ప్రయాణిస్తుంది. ఇరాన్ ఉత్తరాన సరిహద్దుగా ఉన్న ఈ జలసంధి ద్వారా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, ఇరాన్ దేశాల నుండి చమురు, గ్యాస్ ట్యాంకర్లలో తరలిస్తారు.
ఈ చమురులో ఎక్కువ భాగం ఆసియా దేశాలకు వెళ్తుంది. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు ఏదైనా అంతరాయం కలిగితే అది ప్రపంచ చమురు వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. "ప్రమాదం తీవ్రత గురించి ఎంత చెప్పినా తక్కువే" అని నియోబెర్గర్ బెర్మన్ అనే పెట్టుబడి నిర్వహణ సంస్థకు చెందిన సీనియర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ హకాన్ కయా అన్నారు. వారం లేదా రెండు వారాల పాటు మాత్రమే ఈ డిలే ను చమురు కంపెనీలు తట్టుకోగలవని ఆయన పేర్కొన్నారు. ఇక హార్ముజ్ జలసంధి దాదాపు 33 కిలోమీటర్లు (21 మైళ్లు) వెడల్పు ఉన్న ఒక వంపు తిరిగిన జలమార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ ను ఒమన్ గల్ఫ్ తో కలుపుతుంది. అక్కడి నుండి నౌకలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు.

ఇరాన్, ఒమాన్ తమ ప్రాదేశిక జలాలను ఈ జలసంధిలో కలిగి ఉన్నప్పటికీ, ఇది అన్ని నౌకలు ప్రయాణించగల అంతర్జాతీయ జలమార్గంగా పరిగణిస్తారు. హార్ముజ్ జలసంధి వాణిజ్యానికి ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషించింది. చైనా నుండి సిరామిక్స్, దంతపు వస్తువులు, పట్టు, వస్త్రాలు ఈ ప్రాంతం గుండా తరలివెళ్ళేవి. ఆధునిక కాలంలో, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, ఇరాన్ నుండి చమురు, గ్యాస్‌లను మోసుకెళ్లే సూపర్ ట్యాంకర్లకు ఇది ప్రధాన మార్గంగా ఉంది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ












Click it and Unblock the Notifications