వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్వేతసౌధంలో మోడీకి గ్రాండ్ వెల్ కం.. ఇరుదేశాల సంబంధం మరింత బలోపేతం: జో బైడెన్

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవన్ వైట్ హౌస్ చేరుకున్నారు. ఓవల్ కార్యాలయంలో జో బైడెన్, మోడీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చిస్తారు. వైట్ హౌస్ యాక్టింగ్ చీఫ్ ఆఫ్ ప్రొటొకాల్ మోడీకి స్వాగతం పలికారు. ఆయన వెస్ట్ వింగ్ డోర్ నుంచి శ్వేతసౌధంలోకి అడుగిడారు. జో బైడెన్- మోడీ గంటపాటు వివిధ అంశాలపై చర్చ జరపనున్నారు. కాసేపటి క్రితం జో బైడెన్ ట్వీట్ చేశారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్చాయుతంగా మార్చడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్, వాతావరణ మార్పులపై డిస్కస్ చేస్తామని బైడెన్ ట్వీట్ చేశారు.

ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడం, కరోనా వైరస్‌ ఎదుర్కోవడానికి ప్రాక్టికల్ కోఆపరేషన్ ను మరింత అడ్వాన్స్ గా మార్చడం, వాతావరణ సంక్షోభం, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ స్పేస్ కు సంబంధించిన అనేక విషయాలు, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతంగా మార్చడం, వంటి 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనే అంశాలపై చర్చ జరగనుంది.

strengthening deep ties between India, US: joe Biden ahead of meeting with Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.

English summary
I’m hosting Indian Prime Minister Narendra Modi at the White House for a bilateral meeting US President Joe Biden tweeted now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X