జపాన్‌ను వణికించిన భూకంపం: నో సునామీ వార్నింగ్
టోక్యో: జపాన్ ఈశాన్య ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ భూకంపం చోటు చేసుకుంది. రెక్టార్ స్కేలుపై అది 6.8గా నమోదైంది. సునామీ హెచ్చరికలు ఏవీ చేయలేదని అధికార వర్గాలు చెప్పాయి.
ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం ఏదీ రాలేదు. బుధవారం ఉదయం 6.12 గంటల సమయంలో భూకంపం తాకింది. జపాన్‌లోని హోన్సూ దీవిలో 37.9 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది.
భూకంపం కారణంగా కొండ చరియలు విరిగే పడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

జపాన్‌ను 2011లో భారీ భూకంపం కుదిపేసింది. దానికి తోడు సూనామీ కూడా తాకింది. దాంతో అప్పుడు 18 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఈ భూకంపం తర్వాత అప్పుడప్పుడు ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారంనాటిది కూడా అటువంటి ప్రకంపనే అయి ఉండవచ్చునని అంటున్నారు .
బుధవారంనాటి భూకంపం వల్ల అణు విద్యుత్తు రియాక్టర్లకు ఏ విధమైన ముప్పు కూడా వాటిల్లలేదు. కొద్ది సేపు నిలిపేసిన తర్వాత తిరిగి శింకాన్సేన్ బుల్లెట్ రైలుతో పాటు ఇతర రైలు సర్వీసులు తిరిగి నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications