పపువా న్యూగినియాను కుదిపేసిన భూకంపం
పపువా న్యూగినియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.2గా నమోదైంది. మంగళవారం తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోర్స్ బైకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది.
భారీ స్థాయి భూకంపం వచ్చినప్పటికీ పపువా న్యూగినియాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెట్రోలజీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే భూకంపం సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. భూకంప తీవ్రతకు ఇళ్లలో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications