వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీలో తీవ్ర భూకంపం.. నిముషాల వ్యవధిలో రెండుసార్లు; రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు!!

టర్కీలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

టర్కీలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున దక్షిణ టర్కీ లోని సంభవించిన తీవ్రమైన భూకంపం 7.8 తీవ్రతతో సంభవించగా, ఆపై దాని తర్వాత మళ్ళీ 6.7 తీవ్రతో మరో బలమైన భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అందించిన డేటా ప్రకారం భూకంపం గాజియాంటెప్ ప్రావిన్స్ లోని నూర్దగీ నగరానికి తూర్పున 26 కిలోమీటర్లు దూరంలో 17.9 కిలోమీటర్ల లోతుల కేంద్రీకృతమై సంభవించిందని, కొద్ది నిమిషాలలోనే రెండవ భూకంపం సెంట్రల్ టర్కీలో 9.9 కిలోమీటర్ల లోతులో సంభవించిందని పేర్కొంది. ప్రస్తుతం టర్కీలో భూకంపం నేపథ్యంలో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టం పై అధికారికంగా సమాచారం లేనప్పటికీ, భారీ ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Strong Earthquake in Turkey.. Twice Within Minutes; It registered as 7.8 on the Richter scale!!

భూకంపం కారణంగా అనేక భవనాలు కూలిపోయాయని, చాలామంది శిథిలాల మధ్య చిక్కుకున్నారని సమాచారం. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేయబడ్డాయి. అనేక భవనాలు కుప్పకూలినట్టు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రకంపనలు టర్కీ తో పాటు సిరియా, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయిల్, పాలస్తీనా, సైప్రస్ లలోనూ సంభవించినట్లు సమాచారం. తీవ్రమైన భూకంపం కారణంగా చాలామంది చనిపోయినట్టుగా అంచనా వేస్తున్నప్పటికి ఎంత మేరకు ప్రాణా నష్టం జరిగిందనేది ఇంతవరకు తెలియ రాలేదు.

English summary
A huge earthquake occurred in Turkey. The earthquake struck twice within minutes. It registered as 7.8 on the Richter scale. It is expected that there will be heavy loss of life and property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X