ఇజ్రాయెల్ బంకర్లల్లో భారతీయ విద్యార్థులు: అంతకంతకూ మృతుల సంఖ్య రెట్టింపు
జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు దాదాపుగా లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో 1,600 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది.

గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 240 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్‌లోని అనేక స్థానాలను హమాస్ ఉగ్రవాదులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ తమ చేతికి చిక్కిన ఇజ్రాయెలీలను గాజా స్ట్రిప్‌కు తరలించడం మొదలు పెట్టారు. వందలాది మంది ఇజ్రాయెలీలను వారు బందీలుగా పట్టుకున్నట్లు మీడియా తెలిపింది.
ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు.
#WATCH | On Hamas terrorists' attack on Israel, an Indian student in Israel, Goku Manavalan says, "I am very nervous and scared...Thankfully we have shelter & Israeli police forces nearby. So far we are safe...We are in touch with Indian Embassy people, we have a good Indian… pic.twitter.com/tPs6pzQlMo
— ANI (@ANI) October 7, 2023
దాడులు- ప్రతిదాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా స్ట్రిప్, పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో అట్టుడికిపోతున్నాయి. రాకెట్ల ప్రయోగాలు, వైమానిక దాడులతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాము యుద్ధం చేస్తోన్నామంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ప్రకటించారంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీనికి అనుగుణంగా పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. పాలస్తీనా చుట్టూ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరింపజేసింది. లెబనాన్, సిరియా సరిహద్దులనూ కట్టుదిట్టం చేసింది. యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. కౌంటర్ రాకెట్లను అందుబాటులో ఉంచింది.
#WATCH | On Hamas terrorists' attack on Israel, an Indian student in Israel, Vimal Krishnasamy Manivannan Chitra says, "...It is very intense & is scary...Indian Embassy is in touch with us in the group. They are keeping a check on us..." pic.twitter.com/Lw7SoJqxDa
— ANI (@ANI) October 7, 2023
కాగా- ఈ యుద్ధంలో పలువురు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వారంతా ఉన్నత చదువుల కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఊహించిన విధంగా యుద్ధం ఆరంభం కావడంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో బయటికి రాలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.
దీనిపై పలువురు విద్యార్థులు తమ సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారు. తాము ఉన్న ప్రదేశంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో భారతీయులు నివసిస్తోన్నారని, ప్రస్తుతం పోలీసులు, రక్షణ బలగాలు ఇక్కడ మోహరించి ఉన్నాయని గోకుల్ మణివణ్ణన్, విమల్ కృష్ణ స్వామి మణివణ్ణన్ చెప్పారు. ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.
#WATCH | On Hamas terrorists' attack on Israel, an Indian student in Israel, Aditya Karunanithi Nivedita says, "...It was all very sudden we did not expect it, because there are religious holidays in Israel going on. We got the sirens early in the morning at around 5:30 am. We… pic.twitter.com/U48dhoP2Vs
— ANI (@ANI) October 7, 2023
ఆదిత్య కరుణానిధి నివేదిత అనే విద్యార్థిని భయాందోళనను వ్యక్తం చేశారు. యుద్ధం ఆరంభమౌతుందనే విషయాన్ని స్థానికులెవ్వరూ ఊహించలేదని పేర్కొన్నారు. ఒక్కసారిగా సైరన్ మోతలు, బాంబు శబ్దాలు, రాకెట్ దాడులు సంభవించాయని వివరించారు. కొన్ని గంటల పాటు బంకర్లలో తలదాచుకున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications