Sudan: రెండేళ్ల అంతర్యుద్ధం.. అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న సూడాన్ సైన్యం

Sudan:దాదాపు రెండేళ్ల అంతర్యుద్ధం తర్వాత సూడాన్ సైన్యం రాజధాని ఖార్టూమ్‌లోని అధ్యక్ష నివాసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఖార్టూమ్‌లోని అధ్యక్ష భవనాన్ని సూడాన్ సైన్యం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నట్లు సూడాన్ మీడియా, సైనిక వర్గాలు నివేదించాయి. గత రెండు సంవత్సరాలుగా అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సూడాన్ లో ఇప్పటివరకు వేలాది మంది మరణించారు. ఇప్పుడు సైన్యం అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకుంది. పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్(RSF) సభ్యుల కోసం సూడాన్ సైన్యం ఇప్పుడు ప్యాలెస్ చుట్టుపక్కల ప్రాంతాలలో శోధన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా సూడాన్ లో జరుగుతున్న ఈ అంతర్యుద్ధంలో ఓ వైపు సూడాన్ సైన్యం, మరో వైపు రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఉన్నాయని తెలిసిందే. దేశ అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా జరిగిన ఈ అంతర్యుద్ధంలో వేలాది మంది పౌరులు చంపబడ్డారు.

దేశంలో తాండవిస్తున్న కరువు

అధ్యక్ష భవనాన్ని సైన్యం స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పటివరకు రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ రాజధాని ఖార్టూమ్‌లోని అనేక ప్రాంతాల్లో అడపాదడపా కాల్పుల శబ్ధాలు వినిపిస్తున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. సూడాన్ అంతర్యుద్ధం దేశంలో చాలా ప్రమాదకరమైన మానవతా సంక్షోభాన్ని సృష్టించిందని, దేశంలో చాలా చోట్ల కరువు నెలకొందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ అంతర్యుద్ధం దేశవ్యాప్తంగా వ్యాపించిందని యూఎన్ నివేదిక పేర్కొంది. రెండేళ్ల క్రితం రాజధాని ఖార్టూమ్ లో భయంకరమైన అంతర్యుద్ధం మొదలుకాగా.. నగరంలోని చాలా ప్రాంతాలను రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తన ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా సూడాన్ సైన్యం అధ్యక్ష నివాసాన్ని స్వాధీనం చేసుకోవడం అతిపెద్ద విజయమనే చెప్పొచ్చు. ఇటీవల సూడాన్ సైన్యం వరుసగా విజయాలు సాధిస్తోంది.

Sudan Army Retakes the Presidential Palace in Capital Khartoum

అంతర్యుద్ధం ఎలా ప్రారంభమైంది?

సూడాన్ లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ను ఆర్మీలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన రెండు బలగాలకు మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ విషయంలో సూడాన్ సైన్యాధిపతి అబ్దుల్ ఫతాఅల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హుందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకొన్ని విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో సూడాన్ లో అంతర్యుద్ధం మొదలైంది. అనంతరం అధ్యక్ష భవనం, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వంటి వాటిని ఆర్ఎస్ఎఫ్ తన ఆధీనంలోకి తీసుకుంది. యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ఐక్యరాజ్యసమతి సంస్థలను కూడా దేశం నుంచి వీడేలా చేశారు.

రెండు భాగాలుగా విడిపోతుందా?
ఏప్రిల్ 2023లో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆర్‌ఎస్‌ఎఫ్ అధ్యక్ష భవనంతో పాటు రాజధానిలోని చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. కానీ ఇటీవలి నెలల్లో, దేశ సైన్యం తిరిగి వచ్చి ఆర్‌ఎస్‌ఎఫ్ యోధులను వెనక్కి నెట్టడం ప్రారంభించింది. ఇప్పుడు దళాలు నైలు నది ఒడ్డుకు కదులుతున్నాయి. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో సూడాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎఫ్, ఇప్పటికీ రాజధాని ఖార్టూమ్‌లోని అనేక ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఓమ్‌దుర్మాన్‌లోని కొన్ని ప్రాంతాలను అలాగే పశ్చిమ సూడాన్‌ను నియంత్రిస్తోంది. ఆర్ఎస్ఎఫ్ ఇటీవలే డార్పర్ ను సైన్యం నుంచి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు సైన్యం చివరి బలమైన కోట అయిన అల్-ఫషీర్ ను స్వాధీనం చేసుకోవడానికి పోరాడుతోంది. రాజధాని ఖార్టూమ్ ను స్వాధీనం చేసుకోవడం ద్వారా సైన్యం ఇప్పుడు మధ్య సూడాన్ ను స్వాధీనం చేసుకోవడానికి భీకర యుద్ధం ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పుడు దేశం రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదం కూడా ఉంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలపై నియంత్రణ సాధించడానికి తమ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామని రెండు వర్గాలు ప్రకటించాయి. ఇప్పటివరకు శాంతి చర్చలకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+