కాబూల్ లో నాటో కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి, 4 మృతి, 22 మందికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కాబూల్: కాబూల్ లోని అమెరికా ఎంబసీకి సమీపంలో నాటో కాన్వాయ్ పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.ఈ ఘటనలో నలుగురు మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన బుదవారం నాడు చోటుచేసుకొంది.

నాటో కాన్వాయ్ కాబూల్ లోని రద్దీ ప్రాంతం గుండా వెళ్తుండగా బుదవారం ఉదయం పూట ఆత్మాహుతి బాంబుదాడి జరిగినట్టుగా అధికారులు చెప్పారు..అయితే భారీగా పేలుడు పదార్ధాలను కలిగి ఉన్న సూసైడ్ బాంబర్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడని స్థానికులు చెప్పారు.

Suicide bomb attack on NATO convoy in Kabul; 4 killed, 22 injured

ఈ ఘటనతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనతో స్థానికంగా ఉన్న వాహనాలు కూడ పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఈ ఆత్మహుతి ఘటనతో ఈ ప్రాంతమంతా పూర్తిగా రక్తసిక్తమైందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. విదేశీ దళాలను లక్ష్యంగా చేసుకొని తాలిబన్ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి.అయితే ఈ దాడుల్లో భాగంగానే బుదవారం నాటి ఘటన కూడ చోటుచేసుకొందనే అనుమానాలు కూడ వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A suicide bombing near the US embassy in Kabul on Wednesday killed four people and wounded at least 22, Afghan officials said, in an attack on a convoy of armored personnel carriers used by the NATO-led Resolute Support mission.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి