బుర్ర పని చేయట్లేదు: సునంద పుష్కర్‌పై పాక్ జర్నలిస్ట్

Sunanda Pushkar Vs Mehr Tarar
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ పైన పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్ మండిపడ్డారు. తనను ఐఎస్ఐ ఏజెంట్‌గా, థరూర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా సునంద పుష్కర్ చెప్పడాన్ని తరర్ తీవ్రంగా ఖండించారు. సునందకు మతిభ్రమించి ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు.

భర్తను భ్రష్టు పట్టించిన భార్య... ఇప్పుడు సమస్యను సర్దుబాటు చేయాలని చూస్తున్నారని మెహర్ ట్వీట్ చేశారు. (మొదట ఆరోపణలు చేసిన సునంద ఆ తర్వాత భర్త థరూర్‌తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు.) సునంద తీరు చూస్తుంటే ఆమె బుర్ర పని చేస్తున్నట్లు లేదని, ఒక మహిళ మరో మహిళకు తన భర్తతో సంబంధం అంటగట్టడం అత్యంత నీచమైనదని, దీనికంటే మరో నీచం ఉండదని, ఆమెకు వివాహా బంధంపై గౌరవం లేనట్లుగా కనిపిస్తోందని తూర్పారబట్టారు.

తాను శశి థరూర్ వెంట పడుతున్నానని, ఐఎస్ఐ ఏజెంట్‌నను చెబుతోందంటే ఆమె ఏమిటో తెలుస్తోందన్నారు. ఫోన్లలో వెంట పడుతున్నానన్న సునంద పైన తాను పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను ఐఎస్ఐ లేదా రా లేదా సిఐఏ లేదా మొసాద్ ఏజెంట్‌ను కాదన్నారు.

మరోవైపు తన అనుమతి లేకుండా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి సునందా పుష్కర్ సందేశాలు పంపించడం కొంత మనస్థాపాన్ని కలిగించిందని, అయినప్పటికీ తాము సంతోషంగా ఉన్నామని శశి థరూర్ పేర్కొన్నారు. సునంద ఈ వారం అనారోగ్యానికి గురయి ఆసుపత్రిలో చేరారని, ఆమెకు విశ్రాంతి అవసరమని తెలుపుతూ మీడియా తమ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించకుండా ఉంటే కృతజ్ఞత తెలియజేస్తామని థరూర్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+