ప్రపంచమే ఆశ్చర్యపోయేలా.. ఓ ప్రెగ్నెంట్ విచిత్ర అనుభవం
జార్జియా : ప్రెగ్నెన్సీ సమయంలో.. రుతుస్రావం ఆగిపోవడం సర్వ సాధారణం. కానీ, రుతుస్రావం ఆగిపోకుండానే.. అసలు తానో గర్భవతినన్న స్పృహ కూడా కలగకుండానే.. ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం ప్రపంచవ్యాప్తంగా పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
స్టెఫానీ జేగర్స్ అనే మహిళ పొత్తి కడుపు నొప్పితో పాటు కిడ్నీలో రాళ్లు ఉండడంతో.. చికిత్స కోసం భర్త మైఖేల్ జేగర్స్ తో కలిసి పీడ్మంట్ హెన్రీ హాస్పిటల్‌కు వెళ్లింది. తీరా అక్కడికెళ్లాక.. వైద్యులు చెప్పిన విషయం విని షాక్ కు గురైంది. పొత్తి కడుపు నొప్పి అనుకుని హాస్పిటల్ కు వెళ్తే.. మరో 30 నిమిషాల్లో మగ బిడ్డను ప్రసవించబోతున్నావని షాకింగ్ న్యూస్ చెప్పారు వైద్యులు.

విచిత్రమేంటంటే.. స్టెఫానీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆమెకు రుతుస్రావం సాధారణంగానే కొనసాగింది. ఎలాంటి అనారోగ్యం గానీ, కడుపులో బిడ్డ కదిలినట్లుగా గానీ ఎప్పుడూ అనిపించలేదు. గర్భం ధరించిన 38 వారాలపాటు ఓ సాధారణ మహిళల లాగే గడిపింది. బరువు పెరగలేదు సరికదా.. వాంతులు కూడా చేసుకోలేదు. పైగా తాను గర్భవతినయ్యే అవకాశాలు లేవని మూడేళ్ళ క్రితం వైద్యులు తేల్చారని ఇప్పటికే ముగ్గురు పిల్లల తల్లి అయిన స్టెఫానీ తెలిపారు.
మొత్తానికి ఇన్ని ఆశ్చర్యాల నడుమ.. గత బుధవారం తెల్లవారుజామున 3.50 గంటలకు ఓ ముద్దులొలికే బిడ్డకు జన్మనిచ్చింది స్టెఫానీ. బిడ్డకు షౌన్ జూడ్ జేగర్స్ అని పేరు పెట్టారు.
ఎందుకు తెలియలేదంటే..
గర్భవతిగా ఉన్న.. ఆ విషయం స్టెఫానీకి ఎందుకు తెలియలేదో వైద్యులు వివరించారు. సాధారణంగా.. ప్రసవ సమయంలో శిశువల తల ముందుగా బయటకు వస్తుందని, కానీ షౌన్ కాళ్ళు ముందుగా బయటకు వచ్చాయని తెలిపారు. అందుకే శిశువు కూడా గర్భంలో కదలకపోయిందని, దీంతో స్టెఫానీకి ఆ విషయం తెలియలేదన్నారు. కాగా, కొద్దిరోజులుగా మడమ గాయంతో స్టెఫానీ విశ్రాంతి తీసుకుంటుండడం కూడా ఆమెకు ఈ విషయం తెలియకపోవడానికి మరో కారణమన్నారు వైద్యులు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications