వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరోగసీ: సెలబ్రిటీలు తమకోసం పిల్లలను కనే సరోగేట్ మహిళలతో ఎలా ప్రవర్తిస్తారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షన్నా

నేడు చాలా మంది సెలబ్రిటీలు పిల్లలను కనేందుకు సరోగసీని ఎంచుకుంటున్నారు. దీని గురించి సోషల్ మీడియా వేదికగా చాలా మంది మాట్లాడుతున్నారు.

ప్రియాంకా చోప్రా, ఎలాన్ మస్క్, కిమ్ కర్దాషియన్, నయోమీ క్యాంప్‌బెల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదే ఉంటుంది.

ఇంతకీ సెలబ్రిటీలకు సరోగేట్‌గా మారే మహిళల జీవితం ఎలా ఉంటుంది?

షన్నా సెయింట్ క్లెయిర్ ఇలా రెండుసార్లు సెలబ్రిటీల కోసం తల్లి అయ్యారు. ఆ రోజు షన్నా ఫోన్ రింగ్ అయింది. అటువైపు క్యాథరీన్ ఉన్నారు.

కనీసం హెలో కూడా చెప్పడకుండానే ఆమె మాట్లడటం షన్నాకు ఇప్పటికీ గుర్తుంది. ''నువ్వు వార్తల్లో చూసేముందే, నీకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను సరోగసీ కోసం మరోక మహిళను సంప్రదించాను. ఆమె ఇప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది’’అని ఆమె చెప్పారు.

వెంటనే కాసేపు షన్నా అలానే కూర్చుండిపోయాయి. ఆమె గర్భం ఇంకా మొదల్లోనే ఉంది. ఆమె కడుపులో క్యాథరీన్ బిడ్డే పెరుగుతోంది.

ఇప్పుడు క్యాథరీన్‌కు సరోగసీ ద్వారా మరో బిడ్డ పుట్టారు. అంటే క్యాథరీన్ సరోగసీ కోసం షన్నా ఒక్కరినే సంప్రదించలేదు. అసలు దీనికి అర్థం ఏమిటి?

షన్నా కడుపులో పెరుగుతున్న బిడ్డ క్యాథరీన్‌కు కావాలా? వద్దా?

''ఈ విషయాన్ని నాకు మీరు ముందే చెప్పుండాల్సింది. రేపు చెకప్ తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం’’అని షన్నా ఫోన్‌లో చెప్పారు. దీనికి క్యాథరీన్ కూడా సరేనని అన్నారు.

కొన్ని గంటల తర్వాత క్యాథరీన్‌కు షన్నా ఒక మెసేజ్ పంపించారు.

''మీరు చెప్పిన విషయం విని కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను. కానీ, మీ విషయంలో సంతోషంగానే ఉన్నాను. మీ బిడ్డను ప్రేమగా చూసుకోండి. మనం ఆ చెకప్ పూర్తయిన తర్వాత మాట్లాడుకుందాం’’అని ఆ మెసేజ్‌లో రాశారు.

అయితే, క్యాథరీన్ సమాధానం ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు ఫోన్ కూడా చేయలేదు.

సరోగసీ

పెన్సిల్వేనియాలోలోని తన ముగ్గురు పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు టీ తాగుతుండగా ఒక మ్యాగజైన్‌లో సరోగసీ గురించి మొదటగా షన్నా తెలుసుకున్నారు.

ట్రెడిషనల్ సరోగేట్స్‌లో దాతల నుంచి సేకరించిన వీర్యాన్ని వారి సొంత అండాలతో ఫలదీకరణం చెందిస్తారు. అదే ''జెస్టేషనల్ క్యారియర్స్’’లో అయితే, అప్పటికే ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భంలోకి ప్రవేశపెడతారు.

మరోవైపు ''ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ’’ కంటే కమర్షియల్ సరోగసీ భిన్నమైదని, దీనిలో గర్భాన్ని మోసే వారికి డబ్బులు కూడా ఇస్తారని ఆ కథనంలో షన్నా చదివారు.

సరోగసీకి సమర్ధనగా రాసిన ఆ కథనంలో సింగిల్ పేరెంట్స్, ఎల్‌జీబీటీ కుటుంబాలు, సంతాన లేమితో బాధపడే జంటలకు కమర్షియల్ సరోగసీతో చాలా మేలు జరుగుతోందని పేర్కొన్నారు. షన్నాకు అది ఎంతో నచ్చింది.

షన్నా వయసు 30 ఏళ్లు. ఆమె ఇప్పటికే ముగ్గురు పిల్లలను కన్నారు. అయితే, ఇకపై పిల్లలు వద్దని భర్తతో కలిసి ఆమె నిర్ణయం తీసుకున్నారు.

తను జెస్టేషనల్ క్యారియర్ కావాలని షన్నా నిర్ణయించుకున్నారు. దీని కోసం సరోగసీ ఏజెన్సీలో కొన్ని ప్రశ్నలతో నిండిన పత్రాలను వీరు పూరించారు.

వీరి మానసిక స్థితిని వైద్యులు కూడా పరిశీలించారు. ఆ తర్వాత లాయర్లతో డజన్లకొద్దీ సమావేశాలు జరిగాయి.

కొన్ని వారాల తర్వాత ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సెలబ్రిటీ జంట జెన్నిఫర్, మార్క్ ఆమె ప్రొఫైల్ చూశారని, న్యూయార్క్‌లో తనను వారు కలవాలని భావిస్తున్నారని ఫోన్‌లో చెప్పారు.

వీరితో షన్నా చాలా త్వరగానే కలిసిపోయారు. ''వారు చాలా మంచివారు. నా గురించి, నా పిల్లల గురించి వారు చాలా విషయాలు తెలుసుకున్నారు’’అని ఆమె చెప్పారు.

సరోగసీ

ఐవీఎఫ్ క్లినిక్, హోటల్, ట్రావెల్, ఫుడ్‌ ఖర్చులతోపాటు గర్భం దాల్చడంతో హెయిర్‌డ్రెస్సర్‌గా పనిచేస్తున్న ఆమె కోల్పోయే ఆదాయాన్ని కూడా ఆమెకు ఇస్తామని చెప్పారు. మొత్తంగా మూడేళ్లలో 50,000 డాలర్లు (రూ.40.77 లక్షలు)ను ఆమెకు అందించారు.

ఆమె గర్భం నిలవడానికి చాలాసార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. చివరగా ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, ఆమె చేయి పట్టుకొని జెన్నిఫర్, మార్క్ కన్నీటితో ధన్యవాదాలు చెప్పారు.

ఆ తర్వాత, కొన్ని నెలలకు మళ్లీ షన్నాకు జెన్నిఫర్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే ఆమె క్యాథరీన్‌ను పరిచయం చేశారు.

ఒక ప్రముఖ కుటుంబం నుంచి క్యాథరీన్ వచ్చారు. పిల్లలను కనేందుకు ఆమె చాలా ప్రయత్నించారు. సరోగసీ కూడా ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది.

అయితే, జెన్నిఫర్ సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు క్యాథరీన్ తెలుసుకున్నారు. దీంతో షన్నాతో మాట్లాడాలని క్యాథరీన్ నిర్ణయించుకున్నారు.

''మొదటి సంభాషణలో నాకు కాస్త తేడాగా అనిపించింది’’అని షన్నా చెప్పారు.

''ఖర్చులను తగ్గించేందుకు సరోగసీ సంస్థ నుంచి కాకుండా, నేరుగా మనం ఒప్పందం కుదుర్చుకుందాం. దీని కోసం మన లాయర్లతో ముందుకు వెళ్దాం’’అని క్యాథరీన్ చెప్పిన విషయం ఇప్పటికీ షన్నాకు గుర్తుంది.

''ఇప్పటికే జెన్నిఫర్ విషయంలో మానసిక పరీక్షలు నిర్వహించడంతో మరోసారి ఆ పరీక్షలు చేయించుకోవాల్సిన పనిలేదని ఆమె చెప్పారు’’అని షన్నా వివరించారు.

సరోగసీ

మూడుసార్లు ప్రయత్నించాలని షన్నా నిర్ణయించుకున్నారు.

మొదటిగా ''సైక్లింగ్’’అనే విధానం ఉంటుంది. దీనిలో భాగంగా హార్మోన్ ఇంజక్షన్లతో అండాలు ఇచ్చే మహిళ, సరోగేట్ మహిళ పీరియడ్‌లు ఒకేసారి వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత క్యాథరీన్‌ను నేరుగా కలిసేందుకు షన్నా, ఆమె భర్త వెళ్లాలని, అక్కడ ఒక ఐవీఎఫ్ క్లినిక్‌లో షన్నా గర్భంలోకి ఫలదీకరణం చెందించిన అండాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

ఈ దంపతులను కలిసేందుకు క్యాథరీన్ అందంగా ముస్తాబై వచ్చారు.

క్యాథరీన్‌ను హత్తుకోవాలని మొదట షన్నా భావించారు. కానీ, క్యాథరీన్ కాస్త వెనక్కి వెళ్లారు. దీంతో హత్తుకోవడం ఆమెకు అంత ఇష్టం ఉండకపోవచ్చని షన్నా అనుకున్నారు.

పిండాన్ని కడుపులో పెట్టినప్పుడు పక్కనే తాను కూడా ఉంటానని షన్నాకు క్యాథరీన్ చెప్పారు. ఆ తర్వాత తమ డ్రైవర్ క్షేమంగా హోటల్ దగ్గర వారిని విడిచిపెడతామని చెప్పారు.

''అయితే, జెన్నిఫర్, మార్క్ చూసుకున్నట్లుగా ఇప్పుడు ఉండకపోవచ్చు’’అని షన్నా మనసులో అకున్నారు.

సరోగసీ

మొదటి ప్రయత్నం ఫలించలేదు. రెండో ప్రయత్నానికి ముందు రోజు, భోజనానికి షన్నా, ఆమె భర్తను క్యాథరీన్ ఆహ్వానించారు. అప్పుడే తమ ప్రైవేట్ జెట్‌లు, డిజైనర్ ఫర్నీచర్ గురించి ఆమె చెప్పారు.

విలాసవంతమైన ఆ హోటల్‌లో బ్లాక్ లెగ్గింగ్స్ వేసుకొని కూర్చొని అదంతా వినడం షన్నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. వీరిద్దరి మధ్య చాలా తేడా ఉన్నట్లుగా ఆమెకు అనిపించింది.

ఆ మరుసటి రోజు ఒక మందుల డబ్బాతో క్యాథరీన్ షన్నాకు కనిపించారు. షన్నా నరాల సమస్యల వల్లే మొదటి ప్రయత్నం ఫలించలేదని, అందుకే ఈ మాత్రలు కొంత వరకు పనిచేస్తాయని క్యాథరీన్ సూచించారు.

ఆ మాత్రల డబ్బాను షన్నాకు క్యాథరీన్ అందించారు.

''నాకు వద్దు..’’అని షన్నా సమాధానం ఇచ్చారు.

కానీ, క్యాథరీన్ ఊరుకోలేదు.

''అసలు నీ సమస్య ఏమిటి షన్నా? ఒక మాత్ర వేసుకుంటే ఏమవుతుంది’’అని ఆమె అన్నట్లు షన్నా గుర్తుచేసుకున్నారు.

వెంటనే మీతో మాట్లాడటం చాలా కష్టమని షన్నా ప్రత్యుత్తరం ఇచ్చారు. ఒక మాత్రను తీసుకొని నోటిలో వేసుకున్నారు. దీన్ని క్యాథరీన్ పక్కకు వెళ్లినప్పుడు ఊసేశారు.

మొత్తానికి రెండోసారి కూడా షన్నా గర్భం దాల్చలేదు. మరోసారి ప్రయత్నించాల్సి వచ్చింది.

సరోగసీ

ఈ సారి ఒక క్లినిక్ దగ్గర వీరు కలిశారు. అప్పుడు క్యాథరీన్ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇంటీరియర్ డిజైన్ గురించి ఆమె చర్చిస్తున్నారు. షన్నాతో చాలా తక్కువసేపు ఆమె మాట్లాడారు.

అయితే, పది రోజుల తర్వాత శుభవార్త వచ్చింది. షన్నా మూత్రంలో హెచ్‌సీజీ స్థాయిలు పెరిగాయి. అంటే ఆమె కడుపులో గర్భం పెరుగుతోందని అర్థం.

''నాకు చాలా సంతోషంగా అనిపించింది’’అని షన్నా గుర్తుచేసుకున్నారు.

కానీ, క్యాథరీన్‌లో పెద్దగా సంతోషం కనిపించలేదు. ఎందుకంటే ఇదివరకు ఇలానే ఒక మహిళ గర్భంలోకి సరోగసీ ద్వారా పిండాన్ని ప్రవేశపెట్టారు. కానీ, అది ఎక్కువకాలం నిలవలేదు.

''క్షమించండి, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు’’అని అప్పుడు షన్నా చెప్పారు.

''అదంతా ఆమె వల్లే జరిగింది’’అని క్యాథరీన్ చెప్పిన సంగతి షన్నాకు ఇప్పటికీ గుర్తుంది.

''తన తండ్రిని చూసేందుకు 12 గంటలపాటు ఆమె ఆమె వినాశ్రయంలో అలా ఎదురు చూస్తునే గడిపారు. బయటకు వెళ్లొద్దని నేను ఆమెకు చెప్పాను. కానీ, ఆమె వినలేదు. దీంతో గర్భస్రావమైంది’’అని క్యాథరీన్ చెప్పారు.

కొన్ని రోజుల తర్వాత షన్నా హెచ్‌సీజీ స్థాయిలు కాస్త తగ్గాయి. అయితే, నమ్మకం కోల్పోవద్దని ఆమెకు వైద్యులు సూచించారు.

వెంటనే ఆమె క్యాథరీన్‌కు ఫోన్ చేశారు. ''ఏం జరుగుతుందో చూద్దాం’’అని క్యాథరీన్ ఆమెకు చెప్పారు.

సరోగసీ

కొన్ని రోజుల తర్వాత షన్నాకు క్యాథరీన్ ఫోన్‌చేసి, ''వేరొక సరోగేట్ తల్లి ద్వారా నాకు బిడ్డ పుట్టింది’’అని షన్నాకు చెప్పడంతో అంతా నిశ్శబ్దం అలుముకొంది.

అయితే, తన సాధారణ చెకప్‌లకు షన్నా వెళ్లడం మొదలుపెట్టారు. అసలు ఈ బిడ్డ క్యాథరీన్‌కు కావాలో వద్దో ఆమెకు తెలియదు.

నాలుగు వారాల తర్వాత, తన హెచ్‌సీజీ స్థాయిలు మరింత తగ్గాయని షన్నాకు తెలిసింది. ఆ తర్వాత ఆమెకు గర్భస్రావమైంది.

వెంటనే క్యాథరీన్‌కు షన్నా ఫోన్ చేశారు. కానీ, క్యాథరీన్ సమాధానం ఇవ్వలేదు. ఆ వార్తను మెసేజ్ ద్వారా ఆమె తెలియజేశారు.

ఆ తర్వాత ''త్వరలో నీకు ఫోన్ చేస్తాను’’అనే సమాధానం క్యాథరీన్ నుంచి వచ్చింది.

కానీ, క్యాథరీన్ నుంచి రోజులు గడిచినా ఎలాంటి కాల్ రాలేదు. దీంతో షన్నా మళ్లీ మెసేజ్ చేశారు.

''మీరు, మీ బిడ్డ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నా బిల్లులను మీకు పంపించమంటారా?’’అని మెసేజ్‌లో రాశారు. వెంటనే ఆమెకు క్యాథరీన్ నుంచి సమాధానం వచ్చింది.

''మన మధ్య సంబంధం ఎప్పుడో ముగిసిపోయింది’’అని క్యాథరీన్ చెప్పిన విషయం షన్నాకు ఇంకా గుర్తుంది. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ మాట్లాడుకోలేదు.

''నేడు సెలబ్రిటీలు ఎక్కువగా సరోగసీ గురించి మాట్లాడొచ్చు. కానీ, ఏళ్ల నుంచీ ఇది కొనసాగుతోంది’’అని కాలిఫోర్నియాలో ప్రముఖులకు సరోగసీ సేవలు అందించే మోడెర్న్లీ సంస్థ ప్రతినిధి ఆరియా సిముయేల్ చెప్పారు.

ఆమెతోపాటు, తన వ్యాపార భాగస్వామి కూడా సరోగేట్లుగా పనిచేశారు. దీంతో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో అవగాహన ఉంది.

''సాధారణంగా బిజినెస్ మేనేజర్లు, అసిస్టెంట్లు, సెక్యూరిటీ హెడ్‌లతో కలిసి హైప్రొఫైల్ వ్యక్తులు వస్తుంటారు. వీరిని చూసి సరోగేట్లు భయపడుతుంటారు’’అని ఆరియా చెప్పారు.

అయితే, వారి మధ్య భయాలను తొలగించేందుకు సరోగేట్ సంస్థలు పనిచేస్తాయని ఆరియా చెప్పారు.

''సరోగేట్లలో ఆందోళన తగ్గించేందుకు మేం చర్యలు తీసుకుంటాం. వారికి బ్యాగ్రౌండ్ చెక్‌లతోపాటు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తాం’’అని ఆమె వివరించారు.

కొన్నిసార్లో సరోగేట్లు హద్దులు మీరుతుంటారని కూడా ఆమె చెప్పారు. ''తమను రియాలిటీ షోలకు పంపించాలని, తమ కుటుంబ సభ్యులకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించాలని, వారి కోసం డబ్బులు పెట్టాలని కూడా అడుగుతుంటారు’’అని ఆమె అన్నారు.

ఇలాంటి వాటిని చోటులేకుండానే ముందుగానే కాంట్రాక్టుల్లో అన్నీ రాసుకుంటారని ఆరియా చెప్పారు.

క్యాథరీన్‌తో చేదు అనుభవం తర్వాత, మరో జంటను కలిసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అని ఒక సరోగసీ సంస్థ నుంచి షన్నాకు ఫోన్ వచ్చింది. వారిని కలిసిన తర్వాత మరోసారి సరోగసీకి వెళ్లాలని షన్నా నిర్ణయించుకున్నారు.

ఈ సారి కవలలకు షన్నా జన్మనిచ్చారు.

''క్యాథరీన్‌తో ఎదురైన చేదు అనుభవాన్ని మరచిపోయేందుకు నేను మరోసారి సరోగసీకి వెళ్లాలని అనుకున్నాను’’అని షన్నా చెప్పారు.

''నాకు సరోగసీతో రెండు అందమైన అనుభవాలు, ఒక చేదు అనుభవం ఉంది’’అని ఆమె వివరించారు.

నేడు షన్నా ఒక హెయిర్‌డ్రెస్సింగ్ సెలూన్ నడిపిస్తున్నారు. అక్కడకు వచ్చేవారు సెలబ్రిటీల గురించి మాట్లాడుకుంటుంటారు.

''అప్పుడే పిల్లలు పుట్టినవారు, తమ పిల్లలను కోల్పోయిన వారు, అసలు పిల్లలు కలిగే అవకాశం లేనివారు, పిల్లలు వద్దనుకునేవారు ఇలా చాలా మంది నాతో మాట్లాడుతుంటారు’’అని షన్నా చెప్పారు.

''సరోగసీకి అందరూ మద్దతు తెలపకపోవచ్చు. అయితే, ఇది చాలా వ్యక్తిగతమైనది. ఎదుటివ్యక్తి అభిప్రాయాలను మనం గౌరవించాలి’’అని ఆమె వివరించారు.

(సరోగసీ కోసం వచ్చిన జంటల పేర్లు మార్చాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Surrogacy: How celebrities treat surrogate women who bear children for them?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X