Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యుద్ధం కాదు, ఓపిగ్గా ఉన్నాం: డొక్లామ్‌పై సుష్మా, భారత్‌కు చైనా ప్రశంస

చైనాతో నెలకొన్న సరిహద్దు సమస్యకు చర్చలే ఏకైక పరిష్కార మార్గమని, యుద్ధం పరిష్కారం కాదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఆమె గురువారం పార్లమెంటులో మాట్లాడారు.

బీజింగ్: చైనాతో నెలకొన్న సరిహద్దు సమస్యకు చర్చలే ఏకైక పరిష్కార మార్గమని, యుద్ధం పరిష్కారం కాదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఆమె గురువారం పార్లమెంటులో మాట్లాడారు.

'భారత దేశ విదేశాంగ విధానం- వ్యూహాత్మక శక్తులతో కలిసి పనిచేయడం' అనే అంశంపై గురువారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆమె సమాధానమిచ్చారు.

డొక్లాంపై మేం ఓపిగ్గా ఉన్నాం

డొక్లాంపై మేం ఓపిగ్గా ఉన్నాం

డొక్లామ్ విషయంలో భారత్ చాలా ఓపికగా వ్యవహరిస్తోందని సుష్మా స్పష్టం చేశారు. డొక్లామ్ సరిహద్దు సమస్యతో పాటు ఎన్ఎస్‌జిలో భారత సభ్యత్వం, జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌పై ఐరాస ఆంక్షల విషయంలో చైనాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందన్నారు.

Recommended Video

    India-China issues highlighted by External Affairs Minister Sushma Swaraj | Oneindia News
    దౌత్యమార్గాల ద్వారానే పరిష్కారం

    దౌత్యమార్గాల ద్వారానే పరిష్కారం

    వివాదాలను దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని సుష్మా పేర్కొన్నారు. ఒకవేళ యుద్ధానికే వెళ్లాలనుకున్నా జయాపజయాలను పక్కనపెట్టి చర్చలకు కూర్చోవాలన్నారు. ఒక్క డోక్లాం వివాదంపైనే కాకుండా ఇతరత్రా అన్ని విషయాలపైనా చైనాతో మన దేశం చర్చలు జరుపుతూనే ఉందన్నారు. సహనం-సంయమనాలతో ప్రస్తుత ప్రతిష్టంభనను పరిష్కరించుకోగలమనే విశ్వాసంతో ఉన్నామన్నారు.

    చైనా రివర్స్.. భారత్‌పై ప్రశంసలు

    చైనా రివర్స్.. భారత్‌పై ప్రశంసలు

    భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చైనా మీడియా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సారథ్యంలో నడుస్తోన్న గ్లోబల్ టైమ్స్‌లో ఓ వ్యాసం వచ్చింది. డొక్లామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వార్త రావడం గమనార్హం. భారత్‌లో జనాభాతో పాటు పేదరికం ఎక్కువగా ఉంటుందని అనేకమంది చైనీయులు భావిస్తుంటారని, కానీ అందుకు భిన్నంగా అభివృద్ధి అంశాన్ని గమనించాలని పేర్కొంది.

    బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది

    బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది

    భారత్‌లో బిలియనీర్లు పెరుగుతున్న అంశాన్ని ఈ వ్యాసంలో ప్రస్తావించింది. చైనాలో విధాన నిర్ణయాలను త్వరితంగా తీసుకుంటారని, భారత్‌లో ఆలస్యం నెలకొంటుందన్నారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి గణనీయస్థాయికి చేరుకుందని యువ పారిశ్రామికవేత్తలు వినూత్న ఆవిష్కరణలతో అభివృద్ధికి దోహదం చేస్తున్నారని పేర్కొంది.

    చైనా పెట్టుబడిదారులు తెలుసుకోవాలి

    చైనా పెట్టుబడిదారులు తెలుసుకోవాలి

    దేశీయ మార్కెట్‌లో విస్తరించిన అనంతరం ప్రపంచ మార్కెట్‌పైకి భారత పారిశ్రామికవేత్తలు దృష్టి సారిస్తూ భారత ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. భారత్‌ పెట్టుబడులకు అనుకూలమని చైనా పెట్టుబడిదారులు తెలుసుకోవాలని, ముందుగా భారత్‌లోని అన్ని అంశాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుబడులు పెట్టవచ్చని సూచించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+