Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్ హస్తం- తండ్రికొడుకులు సృష్టించిన నరమేధం

ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 16 మంది మరణించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చిచంపారు. ఘటనతో ఒక్కసారిగా సిడ్నీ ఉలిక్కిపడింది. హనుక్కా పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకుని సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన చానుకా బై ది సీ అనే యూదుల కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నల్లటి వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు బీచ్‌లోని ఓ వంతెన సమీపంలో కాల్పులు జరుపుతున్నట్లు ఈ వీడియోలో రికార్డయింది. అరడజనుకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ వెంటనే ప్రజల అరుపులు వినిపించాయి. భయంతో పరుగులు తీశారు.

Sydney Bondi Beach Terror Attack Father-Son Suspects Named Death Toll at 16

ఈ దాడికి పాల్పడిన ఇద్దరు షూటర్లు తండ్రీకొడుకులుగా గుర్తించారు. నవీద్ అక్రమ్, అతని కుమారుడు సాజిద్ అక్రమ్‌గా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యాన్ వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో నవీద్ అక్రమ్ సంఘటన స్థలంలోనే మరణించగా.. సాజిద్ అక్రమ్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా ప్రకటించారు. యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు.

నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్‌ చాలాకాలంగా సిడ్నీలో నివాసం ఉంటోన్నారు. వారి మూలాలు పాకిస్తాన్ లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి కుటుంబం సిడ్నీ శివార్లలోని బోనిరిగ్, క్యాంప్సీల్లో నివసిస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు రాత్రి సిడ్నీ ఈ రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవీద్ అక్రమ్ కు లైసెన్స్డ్ ఆయుధాల విక్రయిస్తుంటాడని తేలింది. పోలీసు ఆపరేషన్లలో ఆరు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ చెప్పారు.

దాడి జరిగిన ప్రాంతంలో అనేక అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. ఇందులో అనుమానితుల్లో ఒకరి వాహనంలో బాంబు తయారీకి వాడే సామగ్రి (ఐఈడీ) కూడా ఉందని వివరించారు. ఈ ఘటనపై అటు అమెరికా కూడా రంగంలోకి దిగింది. దర్యాప్తులో ఎఫ్బీఐ భాగస్వామ్యం కానుంది. ఈ విషయాన్ని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. ఆస్ట్రేలియాకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తామని అన్నారు. ఈ దాడిని డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+