వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడున్నర గంటల పాటు ఫోన్ కాల్: బైడెన్‌కు చైనా అధ్యక్షుడి హెచ్చరిక: తేల్చుకుందాం రా: యూఎస్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాతో చైనా మాటల యుద్ధానికి తెర తీసింది. ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. తీవ్ర హెచ్చరికలనూ జారీ చేసింది. అమెరికాను రెచ్చగొట్టేలా మాటల తూటాలను సంధించింది. నిప్పుతో చెలగాటం ఆడొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై అమెరికా కూడా అంతే ఘాటుగా స్పందించింది. వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేసింది. ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టయింది.

న్యాన్సీ పెలోసి పర్యటన నేపథ్యంలో..

న్యాన్సీ పెలోసి పర్యటన నేపథ్యంలో..

దీనికి ప్రధాన కారణం- తైవాన్ వివాదం. అమెరికా హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనకు పూనుకోవడాన్ని చైనా తప్పుపడుతోంది. న్యాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించాల్సి వస్తే అమెరికా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లీజియన్ ఇదివరకే హెచ్చరించారు. తైవాన్‌ను సందర్శించాలనుకోవడం ఆ దేశ అంతర్గత విషయం కాదని, అది చైనాకు సంబంధించినదని అన్నారు.

మూడున్నర గంటల పాటు..

మూడున్నర గంటల పాటు..

ఇప్పుడిదే విషయం మీద అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్-గ్ఝి జిన్‌పింగ్ సైతం సవాల్, ప్రతిసవాల్ విసురుకున్నారు. ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణ సాగింది. జో బైడెన్ తన కౌంటర్‌పార్ట్ జిన్‌పింగ్‌‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఫోన్ సంభాషణ మూడున్నర గంటల పాటు కొనసాగింది. ఈస్టర్న్ టైమ్‌జోన్ ప్రకారం 8:33 గంటలకు ఆరంభమైన ఫోన్ కాల్ 10:50 నిమిషాలకు ముగిసిందంటే వారిద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్యుద్ధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

బైడెన్ ఫోన్..

బైడెన్ ఫోన్..

తన అధికారిక కార్యాలయం నుంచి తొలుత జో బైడెన్.. జిన్‌పింగ్‌కు ఫోన్ చేశారు. ఆ సమయంలో అక్కడ అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివాన్, డిప్యూటీ అడ్వైజర్ జోన్ ఫైనర్, విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్, ఇండో-పసిఫిక్ కోఆర్డినేటర్ కర్ట్ క్యాంప్‌బెల్, సీనియర్ డైరెక్టర్ లారా రోసెన్ బెర్గర్ ఉన్నారు.

తైవాన్ వివాదం పైనే..

తైవాన్ వివాదం పైనే..

ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరిన్ జీన్-పియర్రె విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఓ నోట్ ఇచ్చారు. తైవాన్ వివాదం మీద ఇద్దరు దేశాధినేతల మధ్య సంభాషణ సాగినట్లు వివరించారు. హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసి.. ఆగస్టులో తైవాన్‌లో పర్యటించాల్సి ఉందని, దీనిపై చైనా ఇదివరకే అభ్యంతరం తెలిపిందని గుర్తు చేశారు.

నిప్పుతో చెలగాటం

నిప్పుతో చెలగాటం

తైవాన్ విషయంలో తలదూర్చి, నిప్పుతో చెలగాటం ఆడొద్దని గ్ఝి జిన్‌పింగ్ నేరుగా జో బైడెన్‌ను హెచ్చరించారు. తైవాన్.. వన్ చైనా పాలసీలో భాగమని స్పష్టం చేశారు. దాన్ని అమెరికా మార్చలేదని తేల్చి చెప్పారు. తమదేశ విధానాల్లో జోక్యం కల్పించుకోవద్దని అన్నారు. తైవాన్‌లో శాంతియుత వాతావరణాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలకు తాము అంగీకరించబోని జిన్‌పింగ్ పేర్కొన్నారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకునే దేశాలు తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదనీ హెచ్చరించారు.

 ముఖాముఖి భేటీకి..

ముఖాముఖి భేటీకి..


దీనిపై బైడెన్ బదులిస్తూ- తైవాన్‌ను స్వతంత్ర దేశంగా భావిస్తున్నట్లు చెప్పగా.. దీన్ని జిన్‌పింగ్ తోసిపుచ్చారు. బయటి శక్తులు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇదే వివాదం మీద ముఖాముఖి సమావేశమౌదామని జో బైడెన్ ప్రతిపాదించగా.. జిన్‌పింగ్ దానికి అంగీకరించారు. ఫేస్ టు ఫేస్ సమ్మిట్‌కు సమ్మతించారు. ఈ భేటీ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని జీన్ పియర్రె చెప్పారు.

English summary
US President Joe Biden and his Chinese counterpart Xi Jinping agreed to schedule their first in-person summit during a sometimes tense phone call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X