లండన్‌లో తాల్ క్రిస్మస్ వేడుకలు: అలరించిన చిన్నారుల ప్రదర్శన, పాటలు
లండన్: తాల్(తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్-టీఏఎల్) క్రిస్మస్ వేడుకలను శనివారం(డిసెంబర్ 10న) రోజున నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లండన్, పరిసర ప్రాంతాల చర్చిలకి సంబంధించిన వారితో పాటు తెలుగు వారు ఒకచోట చేరి ఈస్ట్ లండన్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.

తాల్ క్రిస్మస్ వేడుకలు
వివిధ చర్చిల ప్రతినిధులతో పాటు, పిల్లలు ఏసుక్రీస్తును కీర్తిస్తూ పాటలు ఆలపించారు. సిస్టర్ జెమిమా దారా పర్యవేక్షణలో "యేసు క్రీస్తు జననం" నాటికను బాలలు అత్యంత శ్రద్ధతో ప్రదర్శించారు. యూకేలో పుట్టి పెరుగుతున్న పిల్లలు తెలుగులో ఈ నాటికను ప్రదర్శించడం అందరిని అబ్బురపరిచింది.

అలరించిన కార్యక్రమాలు
సిస్టర్ జెమిమా దారా, సిస్టర్ పద్మ కుందన్ లు వ్యాఖ్యాతలుగా, బ్రదర్ ప్రవీణ్ మానుకొండ గాన బృందానికి వాద్య సహకారాన్ని అందించగా, బ్రదర్ కరుణాకర్ తాల్ క్రిస్మస్ వేడుకలను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాల్ ట్రస్టీలు గిరిధర్ పొట్లూరు, అనిల్ అనంతుల, కిషోర్ కస్తూరి, నవీన్ గాదంసేతి లతోపాటు తాల్ సభ్యులు వంశీ మోహన్ సింగలూరి, శ్రీదేవి అల్లెద్దుల, మల్లేష్ కోట పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రవి మోచెర్ల, రత్నాకర్ దారా లకు కృతజ్ఞతలు తెలిపారు.

క్రిస్మస్ ప్రాముఖ్యత వివరించిన పాస్టర్లు
పాస్టర్ భరత్ క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించగా, పాస్టర్ డామినిక్, పాస్టర్ డానియల్, బ్రదర్ అజయ్ లు బైబిల్ ప్రాధాన్యతను వివరిస్తూ యేసుక్రీస్తుని స్తుతించారు. లండన్, యూకే లోని తెలుగువారి క్షేమం కోరుతూ ప్రార్ధనలు చేసి, తాల్ తెలుగు వారికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. చివరగా ప్రపంచ మానవాళి సంక్షేమం గురించి ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications