• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జర్నలిస్టుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న తాలిబన్లు-కొత్తగా 11 రూల్స్-పాటించకపోతే అంతే సంగతులు...

|

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన స్వేచ్చను పూర్తిగా హరించివేస్తోంది.ఇప్పటికే మహిళలపై అణచివేత చర్యల దిశగా సాగుతున్న తాలిబన్ సర్కార్.. తాజాగా మీడియాపై కఠినమైన ఆంక్షలు విధించింది. మీడియా కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేలా 11 నియమాలను ముందుకు తెచ్చింది. వీటిల్లో ఏ ఒక్క రూల్‌ను పాటించకపోయినా సదరు మీడియా సంస్థ డేంజర్‌లో పడినట్లే.తాలిబన్లు విధించిన ఈ కొత్త రూల్స్ వెన్నులో వణుకుపుట్టించేలా ఉన్నాయని అక్కడి జర్నలిస్టులు వాపోతున్నారు.

ఏంటా 11 రూల్స్...

ఏంటా 11 రూల్స్...

తాలిబన్ ప్రభుత్వం మీడియాపై విధించిన 11 ఆంక్షల్లో మొదటి మూడు ఆంక్షల ప్రకారం... ఇస్లాంకు విరుద్దంగా,జాతీయ నేతలకు అవమానపరిచేలా కథనాలను ప్రసారం చేయవద్దు లేదా ప్రచురించవద్దు.అయితే ఆ వార్తలు యాంటీ ఇస్లామిక్ లేదా జాతీయ నేతలను అవమానపరిచేలా ఉన్నాయనేది ఎవరు నిర్దారిస్తానే విషయంలో స్పష్టత లేదు. రూల్ 7,8 ద్వారా వార్తలకూ సెన్సార్‌షిప్‌ వర్తిస్తుంది.వార్తలు ప్రసారం చేసేటప్పుడు లేదా ప్రచురించేటప్పుడు... చాలా జాగ్రత్త వహించాలి.ముఖ్యంగా,అధికారికంగా ధ్రువీకరించని వార్తల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

భయాందోళనలో జర్నలిస్టులు...

భయాందోళనలో జర్నలిస్టులు...

ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపించే లేదా సమాజ నైతికతకు భంగం కలిగించే అవకాశం ఉన్న వార్తల ప్రసారంలో మీడియా సంస్థలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.రూల్ 10,11 ప్రకారం... మీడియా సంస్థలు వార్తల ప్రసారం,ప్రచురణ విషయంలో గవర్నమెంట్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌తో కోఆర్డినేట్ చేసుకోవాలి. రూల్ 9 ప్రకారం... మీడియా సంస్థలు వాస్తవాలనే ప్రసారం చేయాలి. ఈ ఆంక్షలకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం ఇప్పటికీ బయటకు వెల్లడవలేదు. తాలిబన్ ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలు అక్కడి జర్నలిస్టులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తమకు సాయం చేయాలని కోరుతూ నిత్యం వందలాది మంది ఆఫ్గన్ జర్నలిస్టుల నుంచి మెయిల్స్ వస్తున్నట్లు అమెరికాలోని ప్రెస్ ఫ్రీడం ఆర్గనైజేషన్ సీనియర్ మెంబర్ స్టీవెన్ బట్లర్ తెలిపారు.

ఇప్పటివరకూ 150 సంస్థలు మూతపడ్డాయి..

ఇప్పటివరకూ 150 సంస్థలు మూతపడ్డాయి..

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి దాదాపు 150 మీడియా సంస్థలు మూతపడ్డాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేక ఈ సంస్థలను మూసేశారు. మీడియా స్వేచ్చలో తాలిబన్లు నిరంతరం జోక్యం చేసుకోవడమే ఇందుకు కారణం. దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కొన్ని ప్రధాన దిన పత్రికలు సైతం ప్రచురణ నిలిపివేసి కేవలం ఆన్‌లైన్‌కే పరిమితమయ్యాయి. తాలిబన్ ప్రభుత్వం వచ్చాక టీవీ కార్యక్రమాల్లోనూ చాలానే మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఫారిన్ డ్రామా,ఎంటర్టైన్‌మెంట్,మ్యూజిక్ షో,బులెటిన్స్,పొలిటికల్ డిబేట్స్ స్థానంలో తాలిబన్ అనుకూల వార్తలు ప్రసారం చేస్తున్నారు.

కొనసాగుతున్న ఆంక్షల పర్వం...

కొనసాగుతున్న ఆంక్షల పర్వం...

ఆఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నాక ఏర్పాటు చేసిన మొదటి ప్రెస్ మీట్‌లో ఇస్లాం చట్టాలకు లోబడే మీడియా కూడా పనిచేయాలని తాలిబన్లు ప్రకటించారు.ఇటీవలే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అన్ని రంగాలు,వర్గాలపై ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగానే కాబూల్‌లో వర్కింగ్ విమెన్ ఇంటికే పరిమితం కావాలని ఇటీవల ఆదేశాలిచ్చారు.కేవలం పురుషులతో భర్తీ చేయలేని పనుల్లో మాత్రమే స్త్రీలు కొనసాగాలనే నిబంధన పెట్టారు. అంతకుముందు,ప్రభుత్వ ,ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న చాలామంది మహిళలను బలవంతంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు పంపించేశారు.తిరిగి మళ్లీ కార్యాలయాలకు రావొద్దని... వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.స్త్రీల విద్యపై నిషేధం విధించే యోచనలో ఉన్నారు. మగపిల్లలు చదువుకునే స్కూళ్లు మాత్రమే రీఓపెన్ చేయడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఆకలి,భయం... తీవ్ర దుర్భర పరిస్థితులు

ఆకలి,భయం... తీవ్ర దుర్భర పరిస్థితులు

తాలిబన్ల పాలనలో ఏ వర్గం స్వేచ్చా,హక్కులు,భద్రతను పొందట్లేదు. నిత్యం భయం గుప్పిట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.దానికి తోడు ఉద్యోగ,ఉపాధి లేక ప్రజల ఆర్థిక స్థితిగతులు చితికిపోయాయి. నిన్న మొన్నటిదాకా ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు చేసినవారు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. ఉద్యోగ,ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కడుపు నింపుకునేందుకు ఇళ్లల్లో ఉన్న వస్తువులను అమ్ముకుంటున్నారు.టోలో న్యూస్ కథనం ప్రకారం... చాలామంది కాబూల్ వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను తీసుకొచ్చి అమ్మకానికి పెడుతున్నారు. ఎంతో కొంతకు వాటిని విక్రయిస్తున్నారు.ఆ పూటకు తిండి దొరికితే చాలు అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. వ్యాపారుల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. షాపుల్లో వస్తువులను కొనేవారు కరువవడంతో ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్థిక సంక్షోభం...

ఆర్థిక సంక్షోభం...


అసలే పేదరికం ఎక్కువగా ఉన్న ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు పాలన చేపట్టాక పరిస్థితులు మరింత దిగజారాయి.దేశంలో పేదరికం దాదాపు 97శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు.తినడానికి తిండి కూడా దొరకని దుస్థితిలో ఆఫ్గన్ ప్రజలు అలమటిస్తున్నారు.ప్రజల వద్ద డబ్బు లేదు... ప్రభుత్వానికి విదేశాల నుంచి నిధులు అందడం లేదు.దీంతో పాలనా వ్యవస్థను సక్రమంగా నడిపించే పరిస్థితి కూడా లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆఫ్గనిస్తాన్‌లో మళ్లీ అంతర్యుద్దం తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్),వరల్డ్ బ్యాంక్ ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌కు రుణాలు మంజూరు చేయడం నిలిపివేసింది.తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐఎంఎఫ్ ఈ ఆంక్షలు విధించింది.అటు అమెరికా ఆఫ్గనిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో 9.4బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసింది. తాలిబన్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 39 మంది సభ్య దేశాలను ఆదేశించింది.దీంతో తాలిబన్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది. అందుకే ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల నుంచి కేవలం 200డాలర్లను విత్‌డ్రా లిమిట్‌గా విధించింది.ఇప్పటికే పలు బ్యాంకులు మూతపడగా... కొన్ని బ్యాంకుల ముందు జనాలు భారీ ఎత్తున బారులు తీరి కనిపిస్తున్నారు.

English summary
taliban govt imposed 11 rules to restrict media activities in afghanistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X